Site icon MANATELANGANAA

ఆరోగ్య పురోగతికి అభయం -ఫిజియోతెరపి చికిత్స

ఆరోగ్య పురోగతికి అభయం ఫిజియోతెరపి చికిత్స…. జీవితానికి పునర్జీవం!

నొప్పి నివారణ నుంచి పూర్తిగా నయం అయ్యే వరకూ అడుగడుగునా అండ!!

తాజా ఆధునిక వైద్యంలో కీలకమైన “ఫిజియోథెరపి” కి పెద్దపీట

ఓర్పు.. శ్రద్ధ.. క్రమబద్ధమైన చికిత్సే.. విజయానికి సోపానం అంటున్న సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సునీల్ కిరణ్ గుండు

నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం

  *( అచ్యుత రఘునాథ్ )* 
   *ప్రత్యేక ప్రతినిధి - మన తెలంగాణ    హనుమకొండ / వరంగల్* 

శరీరానికి కదలిక.. జీవితానికి చైతన్యం. గాయాలు.. శస్త్రచికిత్సల అనంతర అనారోగ్యం తదితర శారీరక సమస్యల కారణంగా కోల్పోయిన రోగుల కదలికలను తిరిగి అందించి, నొప్పిని నియంత్రిస్తూ, ఆయా సాధారణ జీవనానికి చేరువ చేయడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోంది.

ఫిజియోథెరపీ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

నివారణ నుంచి పునరావాసం వరకు.. అడుగడుగునా అండ
ఫిజియోథెరపీ అంటే కేవలం గాయం లేదా శస్త్రచికిత్స తర్వాత చేసే చికిత్స మాత్రమే కాదు. శారీరక సమస్యల నివారణ, నొప్పి నియంత్రణ, కండరాల బలం, సమతుల్యత, కదలికల మెరుగుదలతో పాటు పునరావాసంలోనూ ఇది ఎంతో కీలకం.
ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ అనంతరం రోగులు కదలిక, బలం, సమతుల్యత, నడక, స్వతంత్రతను తిరిగి పొందేందుకు ఫిజియోథెరపీ ఎంతో దోహదపడుతుంది. 2026 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ నివారణ, నియంత్రణ, పునరావాసంలో ఫిజియోథెరపీ పాత్రపై దృష్టి సారిస్తోంది.

నొప్పి నుంచి నడక దాకా.. పునరావాసానికి బాట
శస్త్రచికిత్స అనంతరం చేతులు, కాళ్ల కదలికలు తగ్గిపోయిన వారు.. సరిగా నడవలేని వారు.. శారీరక బలహీనతతో సాధారణ పనులు చేసుకోలేని వారికి ఫిజియోథెరపీ పునరావాసంలో కీలకమైన తోడ్పాటును అందిస్తుంది.
ప్రతి రోగి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందుకే చికిత్స కూడా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉండాలి. క్రమబద్ధమైన థెరపీతో పాటు ఓర్పు, ప్రోత్సాహం, నిరంతర కృషి పునరావాస విజయానికి ముఖ్యమైన అంశాలు.

ప్రధాన సమస్యలు… పరిష్కారాలు….
నేటి సమాజంలో ప్రధానంగా ఎదురవున్న సమస్యల్లో
నడుము, మెడ, భుజం, మోకాళ్ళు, మడమలు, కండరాలు, పిక్కలు తదితర నొప్పులతో పాటు మూతివంకర, పక్షవాతం, స్పైన్, నరాలు, డిస్క్ సమస్యలకు సత్వర ఉపశమనమే కాదు… శాశ్వత పరిష్కారానికి ఫిజియోథెరపీ తోడ్పాటు అందిస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు. దీనికి ప్రత్యేకమైన సాంకేతిక పరికరాలే కాదు… నిష్ణాతులైన ఫిజియోథెరపీ బృందాలు పని చేస్తున్నాయి. త్రి నగరిలో శస్త్ర చికిత్సల తర్వాత ఈ విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని గుర్తించారు. రోగుల కోసం చేయూత అందిస్తున్న వైద్యులు గుర్తింపు పొందారు.

రెండు దశాబ్దాలకు పైగా అంకిత సేవ ..
రోగుల శస్త్ర చికిత్స నుంచి అనూహ్యంగా కాళ్లు చేతులు పనిచేయకుండా పోయి…శారీరకంగా అనేక వ్యాధుల బారిన పడిన వారిని విముక్తి చేసే ఫిజియోథెరపీ విభాగంలో… హనుమకొండ–వరంగల్‌ నుంచి సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డా. సునీల్ కిరణ్ గుండు రెండు దశాబ్దాలకు పైగా సేవలందిస్తూ గుర్తింపు పొందారు. “శ్రీ వెంకట సాయి” పేరుతో ఫిజియోథెరపీ చికిత్స, పునరావాస సేవలను అందిస్తూ రోగుల విశ్వాస పొందుతున్నారు.

ఓర్పుతో చికిత్స.. ఆప్యాయతతో సేవ..
వయస్సు.. శారీరక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ అందించడం డా. సునీల్ కిరణ్ సేవా విధానంలో ప్రత్యేకతగా నిలుస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పునరావాసం అవసరమైన రోగులతో ఆయన, తన బృందం ఓర్పుతో పనిచేస్తూ క్రమంగా కదలికను, శారీరక సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు.
“ఫిజియోథెరపీ అంటే కేవలం వ్యాయామం చేయించడం కాదు. కోల్పోయిన కదలికను తిరిగి అందించడం.. రోగిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం.. తన పనులను తానే చేసుకునే స్థాయికి తీసుకురావడమే నిజమైన పునరావాసం” అని డా. సునీల్ కిరణ్ పేర్కొన్నారు.
ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ
రోగి పరిస్థితి, వయస్సు, శారీరక సామర్థ్యాన్ని బట్టి చికిత్సను కొనసాగిస్తూ.. ప్రతి చిన్న పురోగతిని ప్రోత్సహించడం “శ్రీ వెంకట సాయి”లో ప్రత్యేకతగా కనిపిస్తోంది. రోగుల్లో నమ్మకం, ధైర్యం పెంచుతూ సాధారణ జీవితానికి తిరిగి చేరుకునేలా బృందం నిరంతరం కృషి చేస్తోంది.

కదలికే పురోగతికి తొలి మెట్టు
“ప్రతి రోగికి ఓర్పుతో.. శ్రద్ధతో.. అంకితభావంతో చికిత్స అందించడమే మా లక్ష్యం. రోగి మెరుగ్గా కదలాలి.. మెరుగ్గా జీవించాలి.. ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని తానే నడిపించుకోవాలి” అని డా. సునీల్ కిరణ్ తెలిపారు.
రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఆయన సేవా ప్రయాణం ఫిజియోథెరపీ అంటే కేవలం కదలికను పునరుద్ధరించడం కాదు.. జీవితంపై నమ్మకాన్ని తిరిగి కల్పించే పునరావాస ప్రక్రియ అనే సందేశాన్ని చాటుతోంది.“ప్రతి స్ట్రెచ్.. ప్రతి అడుగు.. ప్రతి కదలిక ఒక విజయం”
పునరావాసం పై డాక్టర్ సునీల్ కిరణ్ గుండు సందేశాన్నిస్తూ…
“ప్రతి స్ట్రెచ్‌ ఒక ప్రయత్నం.. ప్రతి అడుగు ఒక పురోగతి.. ప్రతి కదలిక ఒక విజయం. నొప్పిని అధిగమించి, కదలికను తిరిగి పొంది, ఆత్మవిశ్వాసంతో సాధారణ జీవితంలోకి రావడమే ఫిజియోథెరపీ అసలైన విజయం.”అంకితమైన చేతులు.. ఆప్యాయతతో కూడిన హృదయాలు.. నిబద్ధతతో కూడిన సేవ..
కోలుకునే ప్రతి అడుగును మెరుగైన జీవితానికి మరో అడుగుగా మార్చే ప్రయాణమే ఫిజియోథెరపీ అన్నారు.

Share this post
Exit mobile version