Site icon MANATELANGANAA

చైన్‌ స్నాచర్‌ ను అరెస్ట్ చేసిన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు

📰

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌లు, ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.
అరెస్టు చేసిన నిందితుడి వద్ద నుంచి రూ.23.50 లక్షల విలువైన 237 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.10,000 నగదు, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన మంతుర్తి హరీష్‌ (29) సిమెంట్‌ కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ మొదట సహోద్యోగి ఇంటి నుంచి బంగారు గొలుసు దొంగిలించాడు. ఆ తర్వాత జైలు శిక్ష అనుభవించినప్పటికీ అలవాట్లు మార్చుకోకపోవడంతో వరుసగా చైన్‌ స్నాచింగ్‌లు, వాహన చోరీలు జరిపాడు.
హరీష్‌ వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 10 చైన్‌ స్నాచింగ్‌లు, 3 ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా వాహనంపై వెళ్తుండగా యాదవ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకుని, విచారణలో నిందితుడు తన నేరాలను ఒప్పుకున్నాడు.
నిందితుడుని పట్టుకొవడంలో ప్రతిభ కబరిచిన క్రైమ్స్‌ డిసిపి గుణశేకర్‌, క్రైమ్స్‌ ఏసిపి సదయ్య, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, కెయూసి, సిసిఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్‌, రాఘవేందర్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా,సిసిఎస్‌ ఎస్‌.ఐ లు రాజ్‌కుమార్‌, శివకుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్ళు అంజయ్య,జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్‌, చంద్రశేకర్‌,రాములు,నగేష్‌లతో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు

Share this post
Exit mobile version