Site icon MANATELANGANAA

వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2025 జూన్ 9 నుండి 11 వరకు

BADMINTON TOURNEE

బాలురు, బాలికలు, పురుషులు మరియు మహిళలకు వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2025
జూన్ 9 నుండి 11 వరకు కిట్స్ వరంగల్ క్యాంపస్‌లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది అని డబ్ల్యుడిబిఎ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రమేష్ కుమార్   వైస్ ప్రెసిడెంట్ బ్యాట్ డా. పింగిలి. రమేష్ రెడ్డి సంయుక్తంగా ప్రకటించారు.

బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BAT- బ్యాట్)కి అనుబంధంగా ఉన్న వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (డబ్ల్యుడిబిఎ) 2025  జూన్ 9 నుండి 11 వరకు, మూడు రోజుల పాటు  “బాలురు, బాలికలు, పురుషులు మరియు మహిళల కోసం వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2025” ను  కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) క్యాంపస్ లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామని డబ్ల్యుడిబిఎ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రమేష్ కుమార్  మరియు  వైస్ ప్రెసిడెంట్ బ్యాట్,  డబ్ల్యుడిబిఎ   జనరల్ సెక్రటరీ మరియు  కిట్స్ వరంగల్   అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్. పింగిలి. రమేష్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. 

ఆసక్తిగల ఆటగాళ్ళు వెబ్‌సైట్ లింక్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ మోడ్ ద్వారా వారి పేరు నమోదు చేసుకోవాలి.
 వెబ్‌సైట్ లింక్‌ :
https://btronline.in/

ఈ టోర్నమెంట్-2025 కేటగిరీస్: పురుషులు & మహిళలకు అండర్-11 సంవత్సరాలు, అండర్-13, అండర్-15, అండర్-17 మరియు అండర్ -19 సంవత్సరాల క్రీడా కారులు పాల్గొన వచ్చు. ఇందులో సింగిల్స్, డబుల్స్ మరియు మిక్స్‌డ్ డబుల్స్ బ్యాడ్మింటన్ కేటగిరీస్ లో ఆటలు నిర్వహించబడతాయి. యువత బహుళ డైమెన్షనల్ ఎదుగుదలను సాధించడానికి శారీరక మానసిక పెరుగుదల కోసం, ఆటలు ఆడటం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ప్రతి క్రీడా కారునికి పోరాట పటిమ తప్పని సరి అని సగర్వంగా తెలిపారు. 

ఆసక్తిగల బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు ఏవైనా తదుపరి విచారణల కోసం ఈ క్రింది మొబైల్ నంబర్ లకు సంప్రదించండి:

  1. డాక్టర్ పి. రమేష్ రెడ్డి-944059988 
  2. డి. నాగకిషన్-9848027755 (విజయ క్లాత్ స్టోర్స్, చౌరస్తా, వరంగల్) 

ప్రవేశాలకు చివరి తేదీ: జూన్ 4, 2025 సాయంత్రం 5.00 గంటల వరకు సంప్రదించండి.

ఈ కార్యక్రమంలో డబ్ల్యుడిబిఎ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి రమేష్ రెడ్డి, కోశాధికారి డి నాగకిషన్, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Share this post
Exit mobile version