మహాత్మ జ్యోతిపూలే భారత చరిత్రలో చిరస్మరణీయుడు
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్
అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే భారత చరిత్రలో చిరస్మనీయుడని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రం కోర్టు అంబేద్కర్ హాల్ లో శుక్రవారం జరిగిన జ్యోతిబా పూలే 135 వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్ధంతి పురస్కరించుకొని బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు పూలే చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి ప్రసంగించారు.
సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం, సమానత్వం, విద్య కోసం పూలే చేపట్టిన సంస్కరణలు నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన చూపిన దారిలో నడవాలని పిలుపునిచ్చారు. మహిళా విద్య, బాలికల సాధికారత, శూద్ర అతిశూద్రుల ప్రగతి కోసం జీవిత పర్యంతం పూలే చేసిన త్యాగపూరిత సేవలు భారత చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించి
నాటి వ్యవస్థలో వున్న సామాజిక అసమానతలపై ప్రజలను చైతన్య పరిచిన తొలి సాంఘీక సంస్కర్త పూలేను అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్న మహానీయుని స్పూర్తితో బి.సి హక్కుల కోసం, మహిళా సమానత్వం కోసం, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి హక్కులు సాధించడమే పూలేకు నిజమైన నివాళని అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాద్యక్షులు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి డి. రమాకాంత్, సంయుక్త కార్యదర్శి ముసిపట్ల శ్రీధర్, మహిళా సంయుక్త కార్యదర్శి శశిరేఖ, సీనియర్ ఇ.సి ఇజ్జగిరి సురేష్, మహిళా ఇ.సి కళకోట్ల నిర్మల జ్యోతి, బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, సీనియర్ న్యాయవాదులు కల్వల అంబరీష్, దాసరి ప్రేమసాగర్, కోటేశ్వర్ రావు, గంధం శివ, గుడిమల్ల రవికుమార్, మట్టెవాడ విజయ్ కుమార్, సూరం నరసింహస్వామి, అయిత ప్రసాద్, సాయిని నరేందర్, గురిమిళ్ల రాజు, జన్ను పద్మ, రాచకొండ ప్రవీణ్, సిద్ధు నాయక్, ప్రవీణ, అంజలి, తదితర న్యాయవాదులు పాల్గొని నివాళులర్పించారు.

