Site icon MANATELANGANAA

ఎదుటి మనిషికి చెప్పేటందుకే.

ఎదుటి మనిషికి చెప్పేటందుకే..!

మోడీ చెప్పారని..
జడ్జి గారు సైకిల్ మీద కోర్టుకి
వెళ్ళారని..
చంద్రబాబే
కాన్వాయ్ లో వాహనాల
సంఖ్యను తగ్గించారని..
సాక్షాత్తు కలెక్టర్ గారే
ఆఫీసుకి సైకిల్ తొక్కుకుంటూ
చేరుకున్నారని..

ఇవన్నీ పక్కన పెట్టు బ్రో..
దేశం కోసం నువ్వేం చేస్తున్నావని..

అదేంటి..వాళ్లేం చేసారని
అడుగుతున్నావా..

చూసావుగా..
కాన్వాయ్ లో వాహనాలు
తగ్గించడం..
సైకిల్ పై వెళ్ళడం ఇవన్నీ..
ఇంకా అడుగుతావేమి..

నిజంగా ఇవన్నీ కొనసాగుతాయా..

పెద్ద డౌటే..

దేశ ప్రజలు పొదుపు మంత్రం జపించాలని పిలుపు
ఇచ్చిన మోడీ జీ
తర్వాత లగ్జరీ విమానం ఎక్కి
విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు..
దేశ ప్రయోజనాల కోసమే అనుకుందాం.. కాని..
ఆ పర్యటన ఖర్చు కోట్లలో
ఉండదా..తప్పదు మరి..
దేశ సంక్షేమం..

(అసలు మోడీ రోజువారీ
ఖర్చులు ఎలా ఉంటాయో
మరో కథనంలో తెలుసుకుని
ముక్కున వేలేసుకుందాం..)

ఒక్క మోడీ అనే కాదు..
చంద్రబాబైనా..ఇంకెవరైనా
ఈ పొదుపు మంత్రాలన్నీ కొన్ని రోజులే..అవి కూడా జనాలకి చెప్పడానికే..

ప్రభుత్వ కార్యాలయాల్లో..
మంత్రుల పేషీల్లో..
లక్షల రూపాయల్లో
ఉంటుంది ఖర్చు..

కరెంట్ బిల్లులు..
పెట్రోల్ డీజిల్ ఛార్జీలు..
టిఎలు..ఇవన్నీ నెల నెలా
తడిసిమోపెడు..

అంతెందుకు..ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత
పనుల కోసం వాడుకునే
అధికారులు కోకొల్లలు..
అయ్యగారు..అమ్మగారు
బజారుకెళ్ళినా..
గుడికి పోతున్నా..
అమ్మాయిగారు కాలేజీకి
పోవాలన్నా ప్రభుత్వవాహనాల్లోనే..
లక్షల్లో ఉండే ఈ పెట్రోల్ డీజిల్ ఖర్చు ఎప్పుడూ మామూలే..
అరికట్టే నాధుడే ఉండడు..

ఈ పొదుపులు..
జాగ్రత్తలు..
ఇవన్నీ ఎదుటి మనిషికి
చెప్పేందుకే సుమీ..!

          *_ఈఎస్కే.._*
Share this post
Exit mobile version