Site icon MANATELANGANAA

మోడీకి ట్రంప్ చిక్కుముడి

మోడీకి ట్రంప్ చిక్కుముడి!

ట్రంప్ సుంకాలకు
మోడీ బింకాలంట..
దెబ్బకు దెబ్బని
మురిసిపోతున్న
బీజేపీ భజంత్రీలు..!

అమెరికా ఏంటో..
ఆ దేశం ఆదేశం ముందు
మన ఆవేశం ఎంతో..
మొన్న సింధూర్
చేసినా గుట్టు రట్టు..
ఇంకా తిరగేసేదేంటో అట్టు..!

రూపాయి కంటే డాలర్
ముద్దయిన దేశం..
మన జనాభాలో
పది శాతం అక్కడే ఉంటే
అగ్రరాజ్యం సందేశమే ఆదేశమై
యుద్ధాన్ని ఆపడం
గులాముగిరీ కాదా..
అమెరికా గిరి గీస్తే
దాటడం
మోడీ సర్కారు వశమా..
ట్రంప్ గొంతు వింటేనే
మన పాలకులకు
అంత పరవశమా..!

చేసిందంతా చేసి..
అమెరికాకు
సరైన మొగుడు మోడీ అంటూ
గప్పాలు కొట్టే సర్కారు వారి
అల్లాటప్పాలు..
ఇకనైనా మానితే బాగుణ్ణు
వాట్సాపుల్లో కుచ్చుటప్పాలు!

               *_ఈఎస్కే.._*
Share this post
Exit mobile version