వరంగల్‌లో ఇద్దరు సబ్-రిజిస్ట్రార్‌ల అరెస్ట్
వరంగల్, ఏప్రిల్ 20, 2026
వరంగల్‌లో అవినీతి కేసులో ఇద్దరు లంచ గొండి సబ్-రిజిస్ట్రార్‌లను అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం (ACB) అరెస్ట్ చేసారు ల్.
ఈ నెల ప్రారంభంలో కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో వారి లంచగొండి వ్యవహారం బయటపడింది.
అరెస్ట్ అయిన అధికారులు దావులూరి ఆనంద్ (సబ్-రిజిస్ట్రార్-II) మరియు జమలాపురం రామనర్సింహారావు (సబ్-రిజిస్ట్రార్-I).
ఏప్రిల్ 2, 2026న హనుమకొండ జిల్లాలోని వరంగల్ (ఆర్.ఓ) సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీ జరిగింది.
తనిఖీ సమయంలో సుమారు 20 మంది ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు అనుమానాస్పదంగా కార్యాలయంలో తిరుగుతూ కనిపించారు. రూ.47,450 నగదు, పత్రాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో, అధికారులు సూచనల మేరకు రిజిస్ట్రేషన్ కోసం ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, ఆ మొత్తాన్ని నగదు లేదా ఆన్‌లైన్ ద్వారా అధికారులకు అందిస్తున్నట్లు ఏజెంట్లు తెలిపారు.
మొబైల్ ఫోన్ల పరిశీలనలో వాట్సాప్ చాట్‌లు, యూపీఐ లావాదేవీలు బయటపడ్డాయి. అలాగే 8 రోజుల పాటు సేకరించిన రూ.16.23 లక్షల వివరాలు హస్తప్రతుల్లో గుర్తించారు.
దావులూరి ఆనంద్‌కు సంబంధించిన లావాదేవీలు రూ.44.28 లక్షలు, రామనర్సింహారావుకు సంబంధించినవి రూ.74,000గా గుర్తించారు.
మరింత విచారణలో, దావులూరి ఆనంద్ తన కుటుంబ సభ్యుల పేర్లపై నక్కలగుట్టలోని కపిల్ కాకతీయ టవర్స్‌లో రూ.72 లక్షల విలువైన రెండు కమర్షియల్ స్థలాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ఈ ఇద్దరు అధికారులు తమ పదవిని దుర్వినియోగం చేసి మధ్యవర్తుల ద్వారా లంచాలు వసూలు చేసినట్లు ACB అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 20, 2026న ఇద్దరిని అరెస్ట్ చేసి వరంగల్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణలో ఉంది.
లంచం అడిగితే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు.

