నిబంధనలు అతిక్రమించి వాహనం నడిపితే చర్యలు తప్పవు
-ట్రాఫిక్ అదనపు డిసిపి ప్రభాకర్ రావు
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ అదనపు డిసిపి తెలిపారు. ట్రై సిటీ పరిధిలో నిన్న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో అదనపు డిసిపి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు కౌన్సలింగ్ నిర్వహించారు.
ఈ సందర్బంగా వాహన దారులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మీ కుటుంబ యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించి వాహనం నడపటం ప్రమాదకరమని. ఇలా మద్యం సేవించి వాహనం నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని. అలాగే మైనర్లకు వాహనాలు అందజేయవద్దని, అలా చేస్తే వాహన యజమానిపై కేసు నమోదు బడుతుందని, వాహన దారులు తప్పక హెల్మెట్ ధరించడంతో పాటు లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి వుండాలని. ముఖ్యంగా వాహనంపై ప్రయాణించే సమయం లో సెల్ ఫోన్ మాట్లాడవద్దని అదనపు డిసిపి వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

