Site icon MANATELANGANAA

లోయలో..తప్పింది లయ

కాశ్మీరంలో..
వేడెక్కిన సమీరం..!

వ్యాలీలో..
రుధిరంతో హోలీ..!

విహారయాత్ర..
అంతలోనే అంతిమయాత్ర..!

ఎప్పుడో వాటాల్లో
జరిగిన తప్పు..
రగిలింది నిప్పు..
అనునిత్యం ముప్పు..!

మనుషుల్ని చంపడానికి కాల్పులు జరిపితే
పాకిస్తాన్ తీవ్రవాది..
రక్షించడానికి జరిపితే
భారత జవాను..!

నిన్నటివరకు ఉగ్రవాదం..
ఇప్పుడది మతవాదం..!

కాశ్మీర్లో అణువణువునా
అందం..
అక్కడ కొందరి
తోళ్లు మందం..!

ఒక్క ఘటనతో
భారత చిత్రపటం
మొత్తం తడిచింది
రుధిరంతో..

విచారాలు..విచారణలు..
దిగ్భ్రమలు..వి..భ్రమలు
ఘీంకారాలు..ప్రతీకారాలు..
క్షణభంగురం..
యధావిధిగా
ఉగ్రవాదం గరం..గరం!

అనివార్యం యుద్ధం..
ఇక శరసంథానమే ధర్మం..
ఆ ధర్మపరీక్షాంగణమే
కాశ్మీరం..!

(సురేష్..9948546286)

Share this post
Exit mobile version