Site icon MANATELANGANAA

ఉద్యమకారులకు తెలంగాణ సమాజం అండగా నిలవాలి

తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ గోధుమల కుమారస్వామి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్

హనుమకొండలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తూ సంఘీభావ ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలతో పాటు ఎన్నో పోరాటాల్లో భాగమైన తెలంగాణ ఉద్యమకారులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఉద్యమకారులను గుర్తించి అందరికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు గుర్తింపుకోసం కమిటీని వేసింది అందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నం. ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాన్ని అమలు చేయించుకోవడం కోసం తెలంగాణ ఉద్యమకారులు ఐక్య పోరాటాల ద్వారా వారి హక్కులను సాధించుకోవాలని, రాష్ట్ర సాధన కోసం త్యాగపూరిత పోరాటాలు చేసిన ఉద్యమకారులకు తెలంగాణ సమాజం అండగా నిలవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ గోధుమల కుమారస్వామి అన్నారు.ఉద్యకారుల హక్కుల సాధన కోసం హనుమకొండ జిల్లా కేంద్రం ఏకశిల పార్క్ టానూ నాయక్ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం,అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాల వారు త్యాగపూరిత ఉద్యమాలు చేసినారని, రాష్ట్ర సాధన వల్ల తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల బడా నాయకులు, ఉద్యోగస్తులు,పెద్ద వ్యాపారస్తులు బాగుపడ్డారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి వారి విలువైన ప్రాణాలను, సమయాన్ని పోగొట్టుకొని త్యాగపూరిత ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు మాత్రం కనీస గుర్తింపుకు నోచుకోక అన్యాయానికి గురయ్యారని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తానని,తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలాలను ఇస్తామని ఎన్నికల వేళ ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడిచిన తర్వాతనైనా కమిటీని వేయడం అభినందనీయం యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కల్పన కార్యక్రమాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల ఐకాస రాష్ట్ర కో కన్వీనర్ సాధం రాజన్న మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు నేడు వారి హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉద్యమకారులను గుర్తించి వారికి సహాయం అందించడం కోసం ఏర్పాటు చేసిన కమిటి తాత్సార్యం చేయకుండా ఉద్యమకారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కమిటీ విధి విధానాలను వెంటనే ప్రకటించాలని, ఉద్యమకారుల గుర్తింపు కోసం సీనియర్ ఉద్యమకారులు లేకుండా రాజకీయ నాయకులతో కమిటీ వేస్తే అది రాజకీయ పార్టీల మధ్య గొడవలకు దారి తీస్తుంది తప్ప ఉద్యమకారులను గుర్తించి సంక్షేమం అందించేదిగా ఉండదని అన్నారు. రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను గుర్తించాలని, ఉద్యమకారుల భాగస్వామ్యంతో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాకు ఒక ఉద్యమకారుల కమిటీ వేయడం మంచిదని, ఉద్యమకారులను గుర్తించడానికి ప్రాతిపదిక ఏంటో అనే విషయంలో ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారనీ అన్నారు. ఆయా రంగాల్లో ఉద్యమించిన వారిని తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తే చాలా గౌరవంగా ఉంటుందని అన్నారు.

 ఈ ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు జైసింగ్ రాథోడ్, భట్టు రాజేందర్, నవరత్న ఆనంద్, సయ్యద్ గౌస్, చాపర్తి కుమార్ గాడ్గే, జన్ను పద్మ, ఎదునూరి రాజమౌళి, జల్లెల కృష్ణమూర్తి, కొడపాక దేవి, డోలక్ యాదగిరి, రామగిరి బిక్షపతి, సమ్మయ్య రాథోడ్, రజనీ కాంత్, సురాసి విక్రమ్, తాడిశెట్టి క్రాంతి కుమార్, శోభ, జుబేర్, నయీం, ఠాకూర్ మోతీ సింగ్, దొమ్మాటి రవీందర్, గంధం గంధం శోభ, పూలక్క, చెరుకు ప్రవీణ్ కుమార్, అయిషా నస్రీన్, షేక్ అక్రమ్,  ఎం ఎన్ అహ్మద్, రహమాన్, కక్కెర్ల ప్రభాకర్ కేడెల ప్రసాద్, మంద వీరస్వామి, పొడేటి ప్రశాంత్, చిలువేరు రామచంద్రం, సుధమల్ల అశోక్, గడ్డం శరత్, గురిమిల్ల రాజు, కట్టన్న, రుద్రోజు నవీన్, ముకుందాచారి తదితరులు పాల్గొన్నారు
Share this post
Exit mobile version