Site icon MANATELANGANAA

తెలంగాణ మహిళా పోలీస్ అధికారుల రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభం


పోలీస్ అకాడమీ లో తొలి తెలంగాణ మహిళా పోలీస్ అధికారుల మూడు రోజుల సదస్సు ప్రారంభం
హైదరాబాద్:
హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా పోలీస్ అధికారుల తొలి రాష్ట్ర స్థాయి సదస్సు బుధవారం ప్రారంభమైంది.

మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా సంక్షేమం & శిశు అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
సదస్సు లక్ష్యాలు
పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష్ బిష్త్ ఐపిఎస్ మాట్లాడుతూ, కానిస్టేబుల్ నుండి డిజిపి స్థాయి వరకు ఉన్న మహిళా అధికారులు ఐదు గ్రూపులుగా ఏర్పడి చర్చలు జరిపి, చివరగా ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తారని తెలిపారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ,మహిళా పోలీస్ అధికారుల అంకితభావం, క్రమశిక్షణ తన కెంతో గర్వంగా ఉందని అన్నారు.
• మహిళల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎల్ల వేళల తోడ్పాటు నిస్తుందని చెప్పారు.
అలాగే, అధికారిణులు ధైర్యం, దృఢ నిశ్చయంతో ముందుకు సాగి సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను సూచించాలని కోరారు.
మహిళా పోలీస్ సమస్యల పరిష్కారానికి డిజిపి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, ఇతర రాష్ట్రాలలోని ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని పంపాలని సూచించారు. మహిళా అధికారుల ఆరోగ్యం, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలింగ్ సదుపాయం కల్పించాలన్నారు.

ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా పోలీస్ స్టేషన్ల నుండి, జైళ్లు, అటవీ శాఖల నుండి దాదాపు 400 మంది మహిళా అధికారులు పాల్గొన్నారు.

వారందరికీ అకాడమీ లో వసతి సౌకర్యాలు కల్పించారు.
సమావేశంలో మధ్యప్రదేశ్ డిఐజి వినీత్, తెలంగాణ అదనపు డీజీలు స్వాతిలక్రా, బాలనాగదేవి, చారుసిన్హా ఐపిఎస్‌లు పాల్గొన్నారు. వీరిని అకాడమీ డైరెక్టర్ ఘనంగా సత్కరించారు.
కార్యక్రమానికి హాజరైన అధికారుల వివరాలను డిప్యూటీ డైరెక్టర్ జి.కవిత పరిచయం చేయగా, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేసారు.

Share this post
Exit mobile version