Site icon MANATELANGANAA

NTV ప్రసారం పై తెలంగాణ ఐఎఎస్ అధికారుల సంఘం ఆగ్రహం

మీడియా నైతిక విలువలు పాటించాలని సూచన

NTV వార్త ప్రసారం పై తెలంగాణ ఐఎఎస్ అధికారుల సంఘం ఆగ్రహం;
హైదరాబాద్, 09 జనవరి 2026 — సేవలో ఉన్న మహిళా ఐఎఎస్ అధికారులపై NTV చెల్లుబాటు కాని, ధృవీకరించని ఆరోపణలు ప్రసారం చేయడంపై తెలంగాణ ఐఎఎస్ అధికారుల సంఘం తీవ్ర నిరసన తెలియజేసింది.

ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షులు కె రామకృష్ణారావు, కార్యదర్శి జయేష్ రంజన్
సంఘం తరుపున విడుదల చేసిన ప్రెస్ నోట్లో, “ఫ్యామిలీ డిస్కంఫోర్ట్”, ఫోన్ కాల్స్ మరియు వాట్సాప్ చాట్స్ పేరిట తప్పుడు మార్గాల్లో ఆధారాలు చూపిస్తూ చేసిన ఆరోపణలతో కూడిన వార్తలు పూర్తిగా సత్య దూరమని ఖండించారు. ఇలాంటి తగిన ధృవీకరణలు లేకుండా మీడియా మార్గదర్శకాలకు విరుద్దంగా ప్రసారం చేయడం మహిళా అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసిందని వారు పేర్కొన్నారు.
ఇవే వివిధ మహిళా అధికారులకు “కంఫర్ట్ పోస్టింగ్‌లు” ఇవ్వబడ్డాయని తెలుపుతూ చేసిన వార్తలు పరిపాలనా విధానాలను తప్పుగా చూపి, సివిల్ సర్వీస్‌ల నమ్మకాన్ని హరించాయని సంఘం అభిప్రాయపడింది.
NTVతో పాటు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన అన్ని మీడియా సంస్థలనూ సార్వత్రికంగా ఆ విషయాన్ని వెనక్కు తీసుకుని తక్షణం, నిష్పాక్షికమైన విషయాలతో వివరంగా వార్తలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

తమ సంఘం ఇలాంటి తప్పుడు విధానాలను ఏ మాత్రం సహించదని అన్ని న్యాయ మార్గాలను అనుసరించి న్యాయపరంగా ఎదుర్కుంటామని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు నైతిక విలువలను పాటించాలని వారు విజ్ఞప్తి చేసారు.

Share this post
Exit mobile version