మూడున్నర దశాబ్దాలుగా సమాజత్సేవలో ఆబాద్ లయన్స్
జనగామ సెప్టెంబర్ 10: సమాజ ఉన్నతికి తోడ్పడే గురువు ఏ రంగంలో ఉన్నా పూజనీయుడే అని జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి అన్నారు.
లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి లయన్స్ భవన్ లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు లయన్స్ క్లబ్ జనగామ ఆబాదు అధ్యక్షుడు వనమాల సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో 9 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
సన్మానం పొందిన వారిలో కాంచనపల్లి జిల్లా పరిషత్ పి జి హెచ్ ఎం. ఎనగందుల సత్యనారాయణ, ఏకశిలా పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు మహమ్మద్ సలీం, చందా మాధవి, శ్రీ అరబిందో స్కూల్ ఉపాధ్యాయుడు కనికరం లక్ష్మణ్ కుమార్, విశ్రాంత హెచ్ ఎం. ఎస్. జయలత రెడ్డి, తెలుగు పండిట్ పానుగంటి రామమూర్తి, ఇబ్రహీంపూర్ ఉపాధ్యాయురాలు బి. రమాదేవి, కొర్రతండ ఉపాధ్యాయురాలు వలబోజు స్రవంతి, హక్యతండ కొడకండ్ల ఉపాధ్యాయురాలు జి. వన్యశ్రీ లకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ సభ్యులు గత మూడున్నర దశాబ్దాలుగా సమాజసేవ చేయడం అభినంద నీయమని అన్నారు. సమాజంలోని సేవా తత్పరులను గుర్తించి సత్కరించడం వారిని ప్రోత్సహించడం చాలా మంచి పని అని కొనియాడారు. గురువులను గౌరవించడం ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలని ఆమె సూచించారు వారి ఆశీర్వాద బలమే మనకు శ్రీరామరక్ష అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ కన్నా పరశురాములు మాట్లాడుతూ క్లబ్ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. విద్యా కమిటీ సభ్యులు లయన్ ఈ ప్రభాకర్ రెడ్డి, శ్రీభాష్యం రఘు మాట్లాడుతూ గురువు యొక్క గౌరవ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా వివరించారు. కార్యక్రమంలో మెంబర్షిప్ జిల్లా కోఆర్డినేటర్ లయన్ ఏ బిక్షపతి రీజియన్ చైర్మన్ జైన రమేష్ జోన్ చైర్మన్ కన్నా శ్రీనివాసు జిల్లా సెక్రెటరీ పబ్బ చంద్రశేఖర్, మార్కెటింగ్ కోఆర్డినేటర్ క్రిష్ణ జీవన్ బజాజ్ తదితరులు ప్రసంగించారు. ఉపాధ్యాలు తమ స్పందనలో వృత్తి పరంగా తమ అనుభవాలను గుర్తు చేస్తూ తమ సేవలను గుర్తించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రేణుకుంట కృష్ణ, కోశాధికారి బి. వీరయ్య, నాయకులు అల్లాడి ప్రభాకర్, నాగబండి రవీందర్, డా. జి. సీతారాం, రామిని శ్రీనివాసులు, డా. పి. నాగేశ్వర్ రావు, ఏ. మహేశ్వర్ ఎల్. శంకర లింగం తదితరులు పాల్గొన్నారు.

