టాటా అంటే టోటల్ – గురూ
రతన్ టాటా పుట్టినరోజు
28.12.1937
+++++++++++++++++
చిన్నప్పటి నుంచి
ఆ పేరు వింటేనే
అదోలాంటి ధ్రిల్లు..
పులకించే దిల్లు..
రతన్ టాటా..
పేరులోనే మ్యాజిక్..
సక్సెస్ మ్యూజిక్..!
గుండుసూది మొదలు
విమానం వరకు..
టాటా ఉత్పత్తులు
ఉండాలన్నది రతన్ లక్ష్యం..
ఇంటింటా టాటా వస్తువులే
ఆ విజయాలకు సాక్ష్యం..!
ఈ కామర్స్ లో
పడకుండా డీలా..
స్నాప్ డీల్..
సామాన్యుడి అమృతం టీ
అక్కడా లేదు పోటీ..
నగరాల్లో రవాణా..
లేదనుకోకు టికానా..
టాటా పెట్టుబడితో
సిద్ధమైన ఓలా..
క్షణాల్లో ఎదుటనిలిచే
రంగీలా..
చైనా ఫోను క్సియోమి
పోను పోను చలనఫోన్ల రంగంలోనూ టాటా సంచలనం..
టాటా ల్యాండ్..డొకోమో..
అదిరిపోయిన ప్రోమో..
రియల్ లోనూ ఓ చేయి..
ఆ రంగంలో నెస్ట్అవే దే
ఇప్పుడు పైచేయి..
తదనంతరం జెనిఫై సొంతం..
సేవ చేయడమే ఆసాంతం..
సీనియర్ సిటిజన్ల
జీవనం ప్రశాంతం..
అందుకోసమే మొదలైంది
గుడ్ ఫెల్లోస్..
రతన్ నీడలో
హాయిగా పెద్దోళ్ల టైంపాస్..!
సామాన్యుడి కారుగా
అప్పుడెప్పుడో
అనుకున్న మారుతి..
ఇప్పుడు ధర చూస్తే
పోయే మతి..
రతన్ మస్తిష్క
వర్క్ షాపులో
రూపు దిద్దుకున్న నానో..
ఈడేరిన
సగటు భారతీయుని
కారు కల..
ఇప్పుడైతే మరింత సొగసుగా..
రోడ్డుపై ఇంకాస్త దర్జాగా..!
రతన్ టాటా..
వ్యాపారంలో దిగ్గజమైతే
బుద్ధిలో వారిజం..
సాయపడ్డమే ఇజం…
ఇది నిజం..
సొంత లాభం
కొంత మానుకుని
పొరుగువాడికి సాయపడవోయ్..
దానమంటే నిదానం కాదు..
అది టాటాజీ విధానం!
మందు తయారీకి నో..
సరదా సరదా సిగిరెట్టు
కాలేదెపుడు
టాటా వారి పనిముట్టు..
మంచితనమే పాలసీ..
సంస్కారమే లెగసీ..!
ఆయన..
సామాన్యుల్లో సామాన్యుడు
ఉద్యోగుల్లో సద్యోగి..
మనుషుల్లో దేవుడు..
ధన్యజీవుడు..!
🙏🙏🙏🙏🙏🙏🙏
*_సురేష్ కుమార్ ఇ_*
9948546286
7995666286

