హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ
బహుజన సమాజ సంఘ పరివర్తన, సామాజికన్యాయం, బహుజన రాజ్యాధికారం విరామం ఎరుగని పోరాటం చేస్తున్న బాంసెఫ్ (బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్), రాష్ట్రీయ మూలనివాసి సంఘ్ ల 42వ జాతీయ మహాసభలకు న్యాయవాదులు, బహుజన సమాజం పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కేంద్రం అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ఒడిస్సా రాష్ట్రం కటక్ నగరం, బారబతి స్టేడియం వద్ద ఈ నెల 26 నుండి మూడు రోజుల పాటు జరుగు బాంసెఫ్, మూలనివాసి సంఘ్, భారత్ ముక్తి మోర్చా, జాతీయ ఒబిసి మోర్చా 42వ జాతీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ ఐ ఎల్ పి ఎ మాతృ సంస్థ అయిన బాంసెఫ్ వెనుకబడిన తరగతుల కులాల జనగణనతో పాటు దేశంలో మెజార్టీ సమాజమైన బహుజన సమాజం ఎదుర్కుంటున్న పలు సమస్యలపై జాతీయ మహాసభలో చర్చించుతుందని ఆయన అన్నారు. ఒక్కటిగా కలిసి నడిచే బహుజన సమాజాన్ని చీల్చే కుట్రలపై, జనాభా దామాషాపై రిజర్వేషన్లు కల్పించడం, సంచార జాతులను గుర్తించాలని, ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేసి బహుజన వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కొల్లగొట్టడం లాంటి పలు సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యం చేసి బహుజన సమాజాన్ని స్వతంత్ర రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే బాంసెఫ్ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో
ఐ ఎల్ పి ఎ వరంగల్ జిల్లా అధ్యక్షులు విలాసాగరం సురేందర్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పంచగిరి బిక్షపతి, రాష్ట్ర కమిటి సభ్యులు ఎగ్గడి సుందర్ రామ్, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, బి.సి ఇంటలెక్టువల్ ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ కొంగ వీరాస్వామి, న్యాయవాదులు కృష్ణస్వామి, ఇజ్జగిరి సురేష్, గంధం శివ, జి ఆర్ శ్రీనివాస్, జ్యోతి, గంపా వినోద్, వివిధ సంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, జల్లెల కృష్ణమూర్తి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..

