Site icon MANATELANGANAA

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా -సహోదర్ రెడ్డి

రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముద్దసాని సహోదర రెడ్డి

హనుమకొండ జిల్లా న్యాయవాదుల ఘన సన్మానం

 సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదుల రక్షణ, సంక్షేమం కోసం కృషిచేస్తానని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది ముద్దసాని సహోదర్ రెడ్డి అన్నారు. హోరా హోరీగా జరిగిన తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి గెలిచిన ఏకైక నాయకుడు ముద్దసాని సహోదర్ రెడ్డి కి హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాలతో, పోటోలు బహుకరించి మంగళవారం ఘనంగా సన్మానం చేశారు.
 ఈ సందర్భంగా సహోదర్ రెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరాల నా న్యాయవాద వృత్తిలో ఎన్నో పదవులను అనుభవించి న్యాయవాదుల హక్కుల కోసం పోరాడానని, న్యాయవాదుల సంక్షేమం, రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచుతాననని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ కోసం కృషి చేస్తానని, 41 సి ఆర్ పి సి వల్ల న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యే, మంత్రులతో చర్చించి 41 సి ఆర్ పి సి ఎత్తివేసేందుకు కృషి చేస్తానని, కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చే వారు వృత్తిలో నిలదొక్కుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. 

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ వరంగల్ నుండి 11 మంది పోటీ చేయగా ఏకైక వ్యక్తి సహోదర్ రెడ్డి గెలిచి పోరాట జిల్లా వరంగల్ ప్రతిష్టను కాపాడాడని అన్నారు. తనకున్న అనుభవంతో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ కావాలని, రెండు తరాల న్యాయ వ్యవస్థకు సాక్షిగా నిలిచిన సహోదర్ రెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని అన్నారు. బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో మహిళా బార్ హాల్ లో జరిగిన సన్మానంలో సహోదర రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వరంగల్ జిల్లా నుండి మహిళలు కూడా బార్ కౌన్సిల్ కు పోటీ చేసి గెలవాలని, అందుకు నా సహకారం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, ఉపాధ్యక్షులు రమేష్, సంయుక్త కార్యదర్శి అంబేద్కర్, బార్ అసోసియేషన్ నాయకులు వేద కుమారి, స్వాతి, న్యాయవాదులు అంబరీష్ రావు, చిల్లా రాజేంద్రప్రసాద్, శ్యాం సుందర్ రెడ్డి, గంగాదర్ రావు, చిదంబర్ నాథ్, శ్రీధర్ రెడ్డి, చకిలం ఉపేందర్, సాయిని నరేందర్, నాగేంద్ర, కళకోట్ల నిర్మల జ్యోతి, రత్న మంజుల, సుశీల, స్వప్న, వనజ, పద్మావతి, టి సి సుజాత, జన్ను పద్మ, రజని, భాగ్య, జలజ, రమాదేవి, అనిత, జన్ను ప్రభాకర్, సన్నీ, నారాయణ రావు, రాహుల్, లోకేష్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు

Share this post
Exit mobile version