Site icon MANATELANGANAA

ఆధార్ పార్టీతోనే బడుగులకు న్యాయం: డా. ఈడ శేషగిరిరావు

బీసీల ఐక్యతే సమాజ ప్రగతికి బలమైన పునాది

2028 ఎన్నికల్లో అధికారమే ఆధార్ పార్టీ లక్ష్యం

119 నియోజకవర్గాల్లో పోటీకి కార్యాచరణ

హనుమకొండ: బహుజనులు రాజకీయ కూలీలు కాదని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత, న్యాయం కల్పించడమే ఆధార్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది డా. ఈడ శేషగిరిరావు అన్నారు. బీసీల ఐక్యతే సమాజ ప్రగతికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని నేచర్ 369 హోటల్‌లో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆధార్) పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. ఈడ శేషగిరిరావు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఎదిగించాలనే ఉద్దేశంతో ఆధార్ పార్టీ పనిచేస్తోందన్నారు.

వెనుకబడిన వర్గాలు ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధనతో పాటు అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. యువత అన్ని రంగాల్లో రాణించడంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

బీసీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 2028 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆధార్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఆసక్తి ఉన్న యువతకు పార్టీలో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఆధార్ పార్టీ పోటీ చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చిన పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆధార్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గట్ల యుగేందర్ గౌడ్, పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ చైర్మన్ ఆంబోజు బుడ్డయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బండా రాజారాం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మధు, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు నీరటి సత్యం, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు జెట్టి శ్రీనివాస్, పరకాల అసెంబ్లీ నాయకుడు మల్లేష్, కొత్తగూడెం ఇంచార్జి ప్రేమ్ దయిల్, ఖమ్మం ఇంచార్జి బూర సైదారావు, ఖమ్మం పట్టణ అధ్యక్షుడు నక్క అజయ్ పద్మశాలి పాల్గొన్నారు.

అలాగే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గంగుల రాజేందర్ ప్రసాద్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మధు వర్మ నాయక్, రాష్ట్ర నాయకులు తల్లాడ వెంకన్న, మంద హరినాథ్ బాబు, ఖమ్మం జిల్లా నాయకులు సునీల్, నాగరాజు, మొగిలయ్య, రవీంద్ర, శ్రీకాంత్, వరంగల్ జిల్లా నాయకులు అఖిల్, శ్రవణ్, సాగర్, రంజిత్, రాకేష్, శ్యామ్, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యామ్ యాదవ్, మొగిలయ్య ఫౌండేషన్ కార్యదర్శి కూనూరు రంజిత్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు మార్క రవి గౌడ్, కంకేటి సాగర్, కూనూరు రాకేష్, కామగోని శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version