Site icon MANATELANGANAA

ఇదేం గోస “సర్ జీ”

గల్లంతు ఓట్లు గజిబిజి మేళాలు
ప్రత్యేక “SIR” దర్బార్ ల షాక్…!
గంటలకొద్ది వెయిటింగ్
ఓట్ల గల్లంతు భయంతో తిండి తిప్పలు లేకుండా
పడిగాపులు

మూడు స్టేజీల్లో నమోదు… తనిఖీ…డేటా అప్లోడింగ్

డాక్యుమెంటేషన్..సంతకాలు…సర్టిఫికెట్ల అప్లోడింగ్ తర్వాతే…నోటీసుదారుల ఆన్లైన్ ఫోటోలు

దోషుల్లా… ఓటుహక్కు నిలుపుకునేందుకు అర్హతాపత్రాలతో కుటుంబాలు…

ప్రశ్నించే వారితో అగచాట్లుతలలు పట్టుకుంటున్న ఎన్నికల నిర్వహణ బృందాలు…

అడుగడుగునా…
అవరోధాల నడుమ
ఓటర్లు…అధికారుల యమయాతన..

ఓరుగల్లు నడిబొడ్డున
గ్రౌండ్ లోనే గోస…

( అచ్యుత రఘునాథ్ )
ప్రత్యేక ప్రతినిధి – మన తెలంగాణ
హన్మకొండ/వరంగల్

ఓటు నిలుపుకోవాలంటే…
ఓర్పు కావాల్సిందేనా…..!
అన్ని అర్హతలున్నా…
అడుగడుగునా అయోమయమే…!!
అంటే….అవుననేలా…
మ ఓట్లేమాయ్యాయంటూ నోటీసులు అందుకున్న వారు నిలదీస్తుండటం తో ….సమాధానాలు చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
వరంగల్  త్రినగరి లో చేపట్టిన SIR ప్రత్యేక దర్బార్లలో జనం తిప్పలు అంతా ఇంతకాదు.

కేవలం గ్రేటర్ పరిధిలోని డివిజన్లకే పరిమితం కాదు ఈ తాజా SIR ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల లో గందరగోళంగా మారింది.
మ్యాపింగ్ కాలేదని పొంతనలేని నోటీసులు…డాక్యుమెంట్ల గొడవ నడుమ.. పరుగులు తీస్తున్నారు.
నిర్దేశించిన కేంద్రాలకు విధించిన గడువు తేదీలకు అనుగుణంగా తరలి వచ్చిన ఓటర్లతో అన్ని SIR సెంటర్లు సందడి గా మారాయి. ఆయా ప్రాంతాల్లో..మూడు స్టేజీల్లో నమోదు… తనిఖీ…డేటా అప్లోడింగ్ లో ప్రశ్నించే వారితో.. ఇబ్బందులు పడుతున్నారు.
కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చినా…  ఓటర్లు రావడం లేదు … అక్కడక్కడా దోషుల్లా… ఓటుహక్కు నిలుపుకునేందుకు అర్హత గల పత్రాలతో వచ్చిన కుటుంబాలతో డాక్యుమెంటేషన్..సంతకాలు…సర్టిఫికెట్ల అప్లోడింగ్ తర్వాతే…నోటీసుదారుల ఆన్లైన్ ఫోటోలు తీసుకోవడం… BLA నుంచి BLO లు… సూపర్వైజర్ ల నుంచి AERO ల వరకు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడడం కేంద్రాలలో కనిపిస్తున్న దృశ్యాలు.

ఇలా తాజాగా ప్రత్యేక SIR దర్బార్ లకు షాక్ తగిలేలా అడుగడుగునా…అవరోధాలే అన్ని వర్గాలకు ఎదురవుతున్నాయి.
ఎవరిని కదలించినా.. వారి వ్యధలే చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రెండు నుంచి మూడు మార్లు నోటీస్ లతో అవసరమైన పత్రాలు తెచ్చి ఇచ్చి కూడా ఫలితం లేకుండా తిరుగుతున్నామనే వారి సంఖ్య అత్యధికంగా కనిపించింది. ఇక ఈ విధానాన్ని నిలదీస్తూ..దుమ్మెత్తి పోస్తున్న వారు కూడా లేకపోలేదు. ఉన్న ఓటు ఉంటుందో..ఊడుతుందో.. కూడా తెలియడం లేదన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణంలో..
ఇటు ఓటర్లు..అటు అధికారులకు యమయాతన..కలిగిస్తున్న SIR ప్రత్యేక దర్బార్ లపై జరిపిన పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

ఓటరు నమోదు… సవరణ కోసం భారత ఎన్నికల సంఘం (Election Commission of India – ECI) ప్రవేశపెట్టిన ‘Special Intensive Revision (SIR)’ నోటీసుల ప్రక్రియ పై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారం’ నింపడంలో అడుగడుగునా ఎదురైన ప్రతిబంధకాల నడుమ సమర్పించిన వారికి జారీ అయిన నోటీసులు…వాటికి తగిన రీతిలో స్పందించిన వారు అర్హతలను ప్రదర్శిస్తూ సమర్పిస్తున్న ధృవీకరణ పత్రాలు..వాటి పరిశీలన..నమోదు.. ప్రత్యేక సమావేశాలు… డాక్యుమెంటేషన్ తదితర అంశాలు ఎవరికీ మింగుడు పడడం లేదు.
ఇదేందయ్యా మాకేమి పని పాటలు లేవా.. అసలు మావోట్లేమయ్యాయి… పోయినసారి ఎలక్షన్స్ వరకు ఓట్లేసినం కదా ఈ నోటీసులు ఏందీ… అంటూ విరుచుకు పడుతున్నారు.
2002 ఓటర్ జాబితాలో పేర్లు ఉండి, 2026 తాజా జాబితాలో ఓటర్ గా కొనసాగాలంటే “SIR” ప్రక్రియలో డాకుమెంట్స్ ఇచ్చి ధ్రువీకరించు కోవాలి. ఓటు గల్లంతు కాకుండా ఉండేందుకు 2002 పేర్లను 2026 జాబితా పేర్లతో అనుసంధానించడం తలనొప్పిగా మారింది.
మీ తాతల డాకుమెంట్స్ ఇవ్వండని అడుగుతున్నారు.. ఎక్కడి నుండి తెచ్చేది అంటూ ఓటర్లు విసుకుంటున్నారు.

మ్యాపింగ్ సరిగా లేని కారణంగా అనేక ప్రాంతాల్లో 60 శాతం పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ఆయా ఓటర్లకు నోటీసులు ఇవ్వడమే కాక ఆధారాలతో నిర్దేశించిన కేంద్రాలకు… విధించిన గడువు లోగ రావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడమే ఓటర్ల కుటుంబాలను అయోమయానికి గురి చేసింది.
తీరా అన్ని రెడీ చేసుకువెళ్లినా..ఒకేసారి పని పూర్తి కాకుండా..BLO ల చుట్టూ తిరగక తప్పని పరిస్థితి ఏర్పడడం..ఎన్ని సమావేశాలు జరిగినా ఎందరి ఓట్లు గల్లంతు అయ్యాయనే విషయం తేలకపోవడం గమనార్హం.

ఈ సందర్భంగా హన్మకొండ నడిబొడ్డున ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన SIR దర్బార్ ను సందర్శించి ..పరిశీలిస్తే…
డిప్యూటీ తహశీల్దార్, AERO శ్రీమతి కె. రేణుక నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ ఎం.మల్లయ్య, BLO కే.రాణి తో సహా BLA లు..ఇతర సిబ్బంది SIR దర్బార్ నిర్వహణలో మంగళవారం తలమునక లయ్యారు.
ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధాన కేంద్రమైనప్పటికీ కనీసం ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన గదులను కళాశాల యాజమాన్యం ఎన్నికల బృందాలకు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జనం వస్తారన్న సాకు తో ఆరుబయట గ్రౌండ్ లోనే ఉండమని చెప్పడంతో టెంట్ వేసుకుని తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసుకున్నారు ఈ ఎన్నికల అధికారులు.
దీంతో.. దోమలు..చెట్లు ..పొదల నడుమ అధికారగణం ఇబ్బందులు పడకతప్పలేదు. గ్రౌండ్లోనే గోసపడుతూ వారు విధులు నిర్వహించాల్సి రావడం.. ఈ కేంద్రానికి తరలివచ్చిన ఓటర్లు కూడా దోమల బెడద…వాన చినుకుల నడుమ కళాశాల యాజమాన్యం వైఖరిని నిరసించారు. కుటుంబాలతో వచ్చిన వారి నోటీసులను పరిశీలించి ఒక్కొక్కటిగా క్రోడీకరించి.. డాక్యుమెంటేషన్ చేయడం..హెల్ప్ డెస్క్ సహాయంతో సలహాలు..సూచనలు ఇవ్వడం.. ఇచ్చిన దరఖాస్తులు భర్తీ చేశాక ఫోటోలు తీసి స్కానింగ్ తో సహా అప్లోడింగ్ ప్రక్రియను AERO రేణుక, సూపర్వైజర్ మల్లయ్య, BLO రాణి బృందాలు వేర్వేరుగా అన్ని దశల్లో SIR కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఇదే ప్రక్రియ వరంగల్ గ్రేటర్ పరిధిలోనే కాకుండా…అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల వరకు నెలకొనడం SIR లో చేదాటిపోయిన దుస్థితిని బహిర్గత పరుస్తోంది.

Share this post
Exit mobile version