Site icon MANATELANGANAA

రామప్పకు సింగ‌రేణి మైనింగ్ తో ముప్పు అవాస్తవం


స‌మ‌గ్ర శాస్త్రీయ అధ్యయనం త‌ర్వాతే మైనింగ్‌పై ముందుకు
సింగ‌రేణి యాజ‌మాన్యం స్పష్టీకరణ
సింగ‌రేణి భ‌వ‌న్‌, అక్టోబ‌రు 5, 2026
ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్ తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని సింగరేణి యాజమాన్యం సోమవారం ఒక ప్రకటన లో స్పష్టం చేసింది.
సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపూర్ లో చేపట్టాలని తలపెట్టిన వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విషయంలో సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత పురావస్తు శాఖ, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది.
బాధ్యతాయుతమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేకూర్చబోదని, వార‌స‌త్వ సంప‌ద పరి రక్ష‌ ణ‌ కు క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని స్పష్టం చేసింది. పర్యావరణహితమైన చట్టబద్ధమైన మైనింగ్ కార్యకలాపాలు మాత్రమే సింగరేణి అధిక ప్రాధాన్యాలు అని పున‌రుద్ఘాటించింది.

Share this post
Exit mobile version