జాతీయ రైతు నేత మల్లారెడ్డి సంతాప సభలో ఎమ్మిల్యేలు, జాతీయ నాయకులు
పీడిత ప్రజల విముక్తి కోసం నిత్య పరిశోధకుడు, పరిశీలకుడు, నడిచే విజ్ఞాన సర్వస్వం సారంపల్లి మల్లారెడ్డి అని ఎమ్మెల్యేలు, పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు కొనియాడారు. హనుమకొండ జిల్లా కేంద్రం పొద్దుటూరు గార్డెన్ లో సిపిఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి జి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన జాతీయ రైతు సంఘం నాయకులు, సిపిఎం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభలో సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మేయర్ డాక్టర్ టి రాజేశ్వర్ రావు, సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు ఎస్. వీరయ్య రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య, ఎంసిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదెగోయిన రవి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్, సిపిఎం రాష్ట్ర నాయకులు జి. రాములు కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు స్కైలాబ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
రైతాంగ సమస్యలపై, భూ సమస్యలను, జల సమస్యలను, విద్యుత్తు సమస్యలపై నిరంతర అధ్యయనం చేసి ప్రజలను చైతన్యం చేయడంలో జీవితాంతం పోరాటం చేసిన మల్లారెడ్డి వయసులో పెద్దవారు అయినా ఆలోచనలో యువకుడని, చీకటి బతుకుల్లో వెలుగులు నింపే దివిటీగా పని చేశారని అన్నారు. భూమి సమస్యపై, రైతాంగ సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేసేది కమ్యూనిస్టులేనని, అలాంటి వారిలో ముందున్న వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి అని అన్నారు. 1956లో సుందరయ్య అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కోసం తిరిగారని, ప్రాజెక్టు, కాలువలు కమ్యూనిస్టులు పోరాటం వల్ల వచ్చాయని అన్నారు. మల్లారెడ్డి గ్రామంలో సర్పంచ్ గా గెలిచి అన్ని సౌకర్యాలు కల్పించారని, కమ్యూనిస్టులు లేని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, దక్షిణ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి అంటే కమ్యూనిస్టుల వలనేనని అన్నారు. మల్లారెడ్డి చివరి వరకు పార్టీ కోసం పని చేశారని, ప్రజల్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటామని మల్లారెడ్డి ఎప్పుడూ చెబుతుండేవారని, ఆయన పోలీస్ పటేల్ గా ఉండి ప్రజలకు సేవ చేయడం సాధ్యంకాదని కమ్యూనిస్టుగా మారాడని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటమే మల్లారెడ్డి జరిగి అర్పించే నిజమైన నివాళి అన్నారు. కేసులు, హత్యలు, నిర్బంధాలను తట్టుకొని నిలబడ్డారని, కుటుంబాన్ని పార్టీలో భాగం చేశారని, నిరంతరం అధ్యయనం చేసి సమాచారాన్ని ప్రజా సంఘాలకు అందించే వారని అన్నారు. శాసన సభలో ఏం మాట్లాడాలని అంశంపై సలహాలు, సూచనలు ఇచ్చేవారని, సాధారణ జీవితం గడిపారని, అందరితో స్నేహంగా వ్యవహరించే వారని అన్నారు. రాజ్యాంగాన్ని దిక్కరించేలా పాలక వర్గాలు వ్యవహరిస్తున్నాయని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గం అని, అదే మార్గాన్ని మల్లారెడ్డి అనుసరించారని అన్నారు. ఆయ ఆయన చనిపోయేంతవరకు ప్రజల మనిషిగా జీవించారని అన్నారు. వరంగల్ జిల్లాలో సాగునీరు సాగునీరు కోసం రైతాంగ సమస్యల కోసం నిరంతరం ఉద్యమాలు నడిపిన వ్యక్తిని జిల్లాలో ఇండ్లు లేని పేదలను సమీకరించి వేలాదిమంది పేదలకి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయించి ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనత సారంపల్లి మల్లారెడ్డి స్ఫూర్తి అందరికీ ఆదర్శమని ఆయన బాటలో కొనసాగించాలని వారు అన్నారు.
అధ్యయనం, ఆచరణ, ఆందోళన, పోరాటం కలగలిపిన విప్లవకారుడు మల్లారెడ్డి అని అన్నారు. పేదలకు భూములుండాలని, పేదల భూములు లాక్కోవడానికి చేసే ఏ చర్యనైనా వ్యతిరేకించాలని మల్లారెడ్డి అనే వారని, ఆయన నిత్య విద్యార్థిగా అధ్యయనం చేయడంతో పాటు నిత్యం బోధించి ఉద్యమకారులకు ఎంతో జ్ఞానాన్ని అందించారని అన్నారు. తన జీవిజాతాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసిన మల్లారెడ్డి సేవలు చాలా గొప్పవని అన్నారు. సాగునీటి వనరుల అభివృద్ధి, ఉపయోగం గూర్చి శాస్త్రీయంగా చర్చించి వాటి అమలు కోసం నిరంతరం పనిచేసేవారని, ప్రజా పోరాటాల ద్వారానే పీడిత ప్రజలకు విముక్తి జరుగుతుందని నిత్యం బోధించే వాడని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మల్లారెడ్డి మరణం తర్వాత వస్తున్న చర్చపై అన్ని కమ్యూనిస్టు పార్టీలు దృష్టి సారించాలని అన్నారు. దేశానికి వెన్నుముక లాంటి రైతాంగ సమస్యలపై మల్లారెడ్డి పోరాటాలను కమ్యూనిస్టు పార్టీలు దృష్టి సారించాలని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ముక్కలు కావడం చాలా బాధాకరమని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కమ్యూనిస్టులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు టి. సాగర్, గోపు జయపాల్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు రవీందర్ రెడ్డి, సూడి కృష్ణా రెడ్డి, ఎన్. అశోక్ స్టాలిన్, డాక్టర్ విజయలక్ష్మి, చంద్రా రెడ్డి, సిహెచ్ రంగయ్య, వాసుదేవ రెడ్డి, రాగుల రమేష్, చుక్కయ్య, బొట్ల చక్రపాణి, టి ఉప్పలయ్య, గొడుగు వెంకట్, తిరుపతి, ఉడుత రవీందర్, సోమిడి శ్రీనివాస్, శోభన్, సాంబరాజు, బంధు సాయిలు, ఆముదాల మల్లారెడ్డి, జానా రెడ్డి, న్యాయవాదులు శ్రీనివాస రావు, మధుసూదన్ రెడ్డి, వేణుగోపాల్, సాయిని నరేందర్ లతోపాటు వందలాది మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

