జనవరి 29 గురువారం
ఎస్ఎస్ మేడారం జాతర
ములుగు జిల్లా,
రెండేళ్ల కోమారు జరిగే జన జాతర మేడారం తల్లుల రాకతో పులకించింది.
బుధవారం రాత్రి కన్నెపల్లి నుండి సారలమ్మ రాగ గురువారం రాత్రి తల్లి సమ్మక్క గద్దెకు వచ్చారు.
వీరి రాకతో మహాజతార హోరేత్తింది.
జాతరలో సారలమ్మ, సమ్మక్కల ఆగమని రెండూ అద్భుత మైన ఘట్టాలు. లక్షలాది జనం ఈ ఉద్విజ్ఞ క్ష నాల కోసం ఎదురు చూస్తారు.
గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన ఘట్టం అత్యంత వైభవంగా పూర్తి అయింది.
మేడారం చిలకల గట్టు రహదారులు, సమ్మక్క తల్లికి ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు.
తెలంగాణ, ఇతర రాష్ట్రాలు నుండి వచ్చిన భక్తులు రహదారుల వెంబడి రంగవల్లులు, బలులు సమర్పించి అమ్మవారి రాక కోసం వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తూ తన్మయత్వం లో మునిగిపోతున్నారు, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు,యువకులు అనే తేడా లేకుండా ఆనందంతో అమ్మవారి రాక కోసం జై సమ్మక్క తల్లి జై సారక్క తల్లి అనే నినాదాలతో చిలకల గట్టు రహదారి మారుమోగిపోతుంది,
సమ్మక్క తల్లి వచ్చే దారి వెంబడి అధిక సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది, చెట్లు వాహనాలు వాటర్ ట్యాంకులు భవనాలు ఎక్కి అమ్మవారి రాకను స్వయంగా తిలకించాలని ఆత్రుతతో భక్తులందరూ ఉన్నారు,
ముగ్గులు,ఎదుర్కొల్లు, బలులతో రహదారి కిక్కిరిసిపోయింది,
శివసత్తుల పూనకలు,సమ్మక్క తల్లిని ఆవహించుకుని భక్తులు డాన్సులు వేస్తూ అమ్మవారి రాకను స్వాగతిస్తూ ఉన్నారు,
చిలకల గట్టు నుండి ఈరోజు గద్దెలపైకి అమ్మవారు చేరుకోనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారి వెంబడి భారీకేడ్లు నిర్మించి రక్షణగా ఏర్పాట్లు చేశారు,
ఆదివాసి గిరిజన సంఘాలు, అభ్యుదయ యువజన సంఘం, తుడుం దెబ్బ, ప్రత్యేక పోలీసు బలగాలు తదితర విభాగాల శాఖల సమన్వయంతో కలిసి అమ్మవారిని తోడుకొని వస్తున్నారు,
ఈ అపూర్వమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చిలకల గట్టు రహదారి వెంబడి చేరుకున్నారు…
ఈరోజు నుండి శ్రీ సమ్మక్క -సారలమ్మ పగిడిద్దరాజులు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి భక్తుల కోరికలు తీర్చేందుకు వనం నుండి వచ్చి తమ యొక్క కోరికలను నెరవేర్చాలి తల్లి అంటూ భక్తులు మొక్కలు చెల్లించుకోవడం జరిగింది.
సమ్మక్క తల్లి రాకతో మేడారం జాతర పరిసర ప్రాంతాలు భక్తి భావంతో పులకించిపోయాయి.

