Site icon MANATELANGANAA

ఉన్మాదం నిరసిస్తూ మానవతను మేల్కొలుపుతూ… దేశ భక్తిని చాటుతూ…pahalgam అరులకు నివాళులు… రిటైర్డ్ అధ్యాపకులు, ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ

పూర్వ వరంగల్ జిల్లా విశ్రాంత అధ్యాపక ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతల సంయుక్త అధ్వర్యంలో శుక్రవారం రాత్రి పెహలాగామ్ అమరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
విశ్రాంత ఉద్యోగులు నక్కలగుట్టలోని తమ కార్యాలయం నుండి బయలు దేరి  అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో  సమావేశమయ్యారు. అక్కడ ఉద్యోగ సంఘాల ముఖ్యనాయకులు ప్రసంగించారు.
పులి సారంగపాణి  మాట్లాడుతు pahalgam టెర్రర్ ఎటాక్ ఉన్మాద చర్య అని విమర్శించారు. ఉగ్ర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వారికి సంతాపం ప్రకటించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో భారతీయులందరు ఐక్యంగా ఉన్నారని, కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అన్ని వర్గాల ప్రజలు కల్సి కట్టుగా మద్దతుగా ఉంటారని అన్నారు.

తూపురాని సీతారాం  మాట్లాడుతూ ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందే నని అన్నారు.  గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాద ఉన్మాదులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు.
కొవ్వొత్తుల ర్యాలీలో విశ్రాంత ఉద్యోగులు దేశభక్తి ని చాటారు.
హైదరాబాద్ తర్వాత ప్రముఖ నగరాలలో ఒకటైన వరంగల్ లో ఇలాంటి స్ఫూర్తి దాయకమైన ర్యాలీ నిర్వహించడం అభినంద నీయమని పలువురు ప్రశం సించారు.

Share this post
Exit mobile version