Site icon MANATELANGANAA

ఏడుపదులలో డాక్టరేటు పట్టా – రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పొన్నాల రామయ్య ఘనథ

కేఎల్ యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్.డి పట్టా పొందిన పి. రామయ్య
విద్యార్జనకు వయసు అడ్డంకి కాదని పట్టుదలతో పరిశోదన గావించి పట్టా సాదించిన మాజీ చీఫ్ ఇంజినీర్
విజయవాడ: కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కేఎల్ యూనివర్సిటీ) సివిల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్.డి పట్టాను ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) ప్రభుత్వంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన పి. రామయ్యకు ప్రదానం చేసింది.
పరిశోధన వివరాలు
దాదాపు 70 ఏళ్ల వయసులో ఉన్న రామయ్య “Evaluation of Dynamic Soil Structure Interaction Effects in Construction Using Optimization and Soft Computing Techniques” అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఈ పరిశోధన కేఎల్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డా. సంజీత్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది.
అధికారిక ఆమోదం
పరీక్షకుల మరియు వైవా-వోసే బోర్డు సిఫారసుల ఆధారంగా వైస్ చాన్స్‌లర్ పట్టాను మంజూరు చేశారు. రిజిస్ట్రార్ డా. కె. సుబ్బా రావు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ప్రేరణగా నిలిచిన రామయ్య
డాక్టరేట్ పట్టా సాదించిన రామయ్యను అన్నివర్గాల వారు అభినందనల్లో
ముంచెత్తారు. ఆసక్తి, శ్రద్ద, పట్టుదల, నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉంటే జీవితంలో ఏ దశలోనైనా విద్యా ర్జన సాధ్యం అనేందుకు ఈ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్  ఒక ప్రేరణగా నిలిచారు.

Share this post
Exit mobile version