Site icon MANATELANGANAA

లఢక్ లో రెడ్ క్రాస్ సేవా స్పూర్తి జెండా

లఢక్ లో రెడ్ క్రాస్ సేవా స్పూర్తి జెండా

హనుమకొండకు చెందిన యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ ఇ.వి. సాత్విక లడఖ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు మార్గాలలో ఒకటైన ఖర్దుంగ్లా (ఎత్తు: 17,582 అడుగులు) వద్ద రెడ్ క్రాస్ జెండాతో సేవా భావనను ప్రతిబింబించారు. సేవల్లో ప్రత్యేకతను చాటుతున్న రెడ్ క్రాస్ స్పూర్తి చిహ్నం జెండాగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సాత్విక మాట్లాడుతూ, “పదవ తరగతి నుండి రెడ్ క్రాస్ సొసైటీ పట్ల, మా నాన్న చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలిని అయ్యాను అని అన్నారు.


జాతీయ స్థాయిలో శిక్షణ పొంది, అనేక రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నాతో పాటు మరి కొందరిలో రెడ్ క్రాస్ పట్ల చైతన్యం కలిగించాలి. ఈ క్రమంలో సమాజ సేవ నా జీవన లక్ష్యం” అని తెలిపారు.

సమాజ సేవ పట్ల ఆమె చూపుతున్న అంకితభావం, ధైర్యం, త్యాగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈ విజయంతో తెలంగాణ రాష్ట్ర యువతకు ఆమె ఒక ఆదర్శంగా నిలిచారు.

Share this post
Exit mobile version