Site icon MANATELANGANAA

కాళేశ్వరం లో పూర్ణాహుతి తో ముగసిన యోగాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్యం, వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు నేడు పూర్ణాహుతితో ముగిశాయి. సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ మహా పర్వదినంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈఓ మహేష్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ 12 హోమాలు ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు మరియు వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలని ఆకాంక్షతో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ విశేష పూజలు చేశారని తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేశారు.

Share this post
Exit mobile version