రాష్..ట్రపతి ఎవరున్నారు..?
దురదృష్టవశాత్తు మన దేశంలో
రాష్ట్రపతులందరూ
దృతరాష్ట్రపతులుగానే
మిగిలిపోతున్నారు..!
స్వతంత్ర భారత దేశానికి
ఇంతవరకు పదిహేను మంది రాష్ట్రపతిగా పనిచేశారు.
వారిలో ప్రతిభాపాటిల్..
ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము
మహిళలు..
ఈరోజున ఇలా ఈ వ్యాసం రాయడానికి కారణం
ఇదే రోజున..అంటే జులై 25న
ఎక్కువ మంది రాష్ట్రపతులు
బాధ్యతలు చేపట్టారు..
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన
భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా బాబూ రాజేంద్రప్రసాద్ పని చేశారు.
ఆయన తర్వాత సర్వేపల్లి..
ఆ తర్వాత వరసగా
జాకీర్ హుస్సేన్..
వరాహ వెంకటగిరి..
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
నీలం సంజీవరెడ్డి.
జ్ఞాని జైల్ సింగ్..
ఆర్ వెంకట్రామన్..
శంకరదయాల్ శర్మ..
కె ఆర్ నారాయణన్..
అబ్దుల్ కలాం..
ప్రతిభా పాటిల్..
ప్రణబ్ ముఖర్జీ..
రామ్నాథ్ కోవింద్ పనిచేశారు.
ప్రస్తుతం రాష్ట్రపతిగా
ద్రౌపది ముర్ము
వ్యవహరిస్తున్నారు.
మధ్యలో బీడీ జెట్టి..
హిదయతుల్లా
(ఉపరాష్ట్రపతులు)
రాష్ట్రపతులుగా తాత్కాలిక
బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్రపతికి విశేష అధికారులుఉంటాయి.
అయితే వాటిని ఇంతవరకు
పూర్తి స్థాయిలో వినియోగించిన వారు ఎవరూ లేరని చెప్పక తప్పదు.
అదృష్టవశాత్తూ మన రాష్ట్రాపతులు ఎవరూ కూడా
పెద్దగా వివాదాల బారిన పడింది లేదు..అదే సమయంలో ప్రభుత్వానికి గాని..ఆయా సమయాల్లో ప్రధానిగా పనిచేసిన..లేదా చేస్తున్న వారికి గాని పెద్దగా తలనొప్పిగా పరిణమించిన సందర్భాలు కూడా కనిపించవు.ప్రధాని గాని..
క్యాబినెట్ గాని చేసిన ప్రతిపాదనలు..తీర్మానాలకు
మౌనంగా ఆమోద ముద్ర వేయడం తప్ప ఏ రాష్ట్రపతి కూడా తనదైన ముద్ర వేసింది లేదు..ఈ పరిస్థితే రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అనే టైటిల్ని మిగిల్చేశాయి..
ఇలాంటి పరిణామాల వల్లనే
మన దేశంలో వివిధ ప్రభుత్వాల హయాంలో లెక్కలేనన్ని అవినీతి కార్యకలాపాలు..
కుంభకోణాలు.. స్కాములు జరిగి దేశ ప్రతిష్ఠకు అంతులేని
దెబ్బ తగిలింది.
మనం అనుకుంటాం..
కలాం గొప్పగా పనిచేశారని..
మిగిలిన వారితో పోలిస్తే
ఆయనకు కొంత మినహాయింపు ఉంటుందని..
కలాం పదవీకాలంలో నిజాయితీగా పనిచేసి ఉండచ్చు..ఆమాటకొస్తే
రాష్ట్రపతులందరూ
నిజాయితీగానే పనిచేశారు.
కాని రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను ఉపయోగించి..ప్రభుత్వాన్ని
నియంత్రించే బాధ్యతను
పకడ్బందీగా నిర్వర్తించి
ప్రజల తరపున ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలను
ప్రశ్నించిన ఉదంతాలు
పెద్దగా లేవు..
ఒకరకంగా చెప్పాలంటే
ఇందిర కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరొందిన జైల్ సింగ్ మాత్రం రాజీవ్ గాంధీ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోస్టల్ బిల్లును తిప్పి పంపి
ఆ రోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించారు..
అలా కొన్ని సందర్భాల్లో..
కొందరైనా కాస్త గట్టిగా
వ్యవహరించి ఉంటే
కొన్ని పరిస్థితులు మారి
దేశం ఇంకా బాగుండేది.
అత్యున్నత పదవి మరింత
గౌరవాన్ని పొంది ఉండేది.
అంత గొప్ప కుర్చీలో కూర్చున్న వారు ఇంకా గొప్పగా మన్నన
అందుకుని ఉండేవారు..
రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్
అనే అపప్రద కొంతైనా
మాసి ఉండేది..!
ఈఎస్కే..జర్నలిస్ట్..