Site icon MANATELANGANAA

ప్రణామ్ డే కేర్ సెంటర్ లో వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ: లవకుమార్ రెడ్డి


జనగామ జూలై 9 : వృద్ధుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయరాదని ప్రముఖ వైద్యులు, రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా చైర్మన్ డా. లవకుమార్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రం ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ లో గురువారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ కన్న పరశురాములు అధ్యక్షతన జరిగిన ఆరోగ్య అవగాహన సదస్సులో లవకుమార్ రెడ్డి మాట్లాడుతూ వయో వృద్ధుల సౌకర్యార్థం ప్రతి వారం ఒకప్రత్యేక వైద్య నిపుణుచే పరీక్షా శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు శిబిరంలో పాల్గొన్న ప్రముఖ నరాల వాద్యులు డా. కె. రంజిత్ కుమార్ మాట్లాడుతూ వయోవృద్ధులు ప్రత్యేకించి షుగర్ వ్యాధి ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మధుమేహం ఎగుడు దిగుడు జరిగే సందర్భాలలో నరాలకు సంబంధించిన వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందని అన్నారు. శిబిరంలో పాల్గొన్న 36 మంది వయోవృద్ధులకు పరీక్షలు నిర్వహించి సలహాలు ఇచ్చి అవసరార్థులకు మందులు కూడా ఉచితంగా వితరణ చేశారు. ఈ సందర్భంగా పలువులు వయో వృద్ధులు మాట్లాడుతూ డే కేర్ సెంటర్ నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు అల్లాడి ప్రభాకర్ రావు, గాదె క్యాథరిన్, డా. చంద్రగిరి రాజమౌళి, పేర్వారం ప్రభాకర్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు పెద్ది హరిబాబు, జగదీశ్వర చారి, డా. జి. సీతారాం, ఎల్. శంకర్లింగం, కీర్తి నర్సయ్య, అల్లాడి మోహన్ రావు, మంగ బిక్షపతి, నీల మధుసూదన్, నీల వెంకటేశ్వర్లు, జిల్లా నారాయణ, మల్లం ప్రసాద్, చేటిపల్లి ఉమ, కన్న సత్యమ్మ
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా పక్షాన డా. రంజిత్ కుమార్ ను సన్మానించారు.

Share this post
Exit mobile version