Site icon MANATELANGANAA

భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో

peter navarro

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించడానికి భారత్ తోడ్పడుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటం వల్లే ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయని, దీన్నే తాను “మోదీ యుద్ధం”గా పేర్కొంటున్నానని ఆయన అన్నారు.

ఓ అంతర్జాతీయ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో మాట్లాడుతూ–

“భారత్ నుంచి రష్యాకు వెళ్తున్న డబ్బు యుద్ధానికి ఇంధనంగా మారుతోంది. ఉక్రెయిన్ పౌరుల మరణాలకు భారత్ బాధ్యత వహించాలి. అంతేకాక, మేము అమెరికన్ల డబ్బుతో మోదీ యుద్ధాన్ని నెట్టుకొస్తున్నాం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా నవారో ఇలాంటి ఆరోపణలే చేశారు. అమెరికా నుంచి వస్తున్న ఎగుమతుల డబ్బుతో భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తోందని, ఆ చమురును శుద్ధి చేసి రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయని అన్నారు. ఈ డబ్బు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు.

రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షగా భారత్‌పై అమెరికా 50% సుంకం అమలు చేసిన విషయం తెలిసిందే.


👉 —Ends

Share this post
Exit mobile version