మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు
రాష్ట్ర కమిటీని అభినందించిన మంత్రులు
ఇటీవల తెలంగాణ రాష్ట్ర పెరిక (పురగిరి క్షత్రియ) కుల రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన యర్రంశెట్టి ముత్తయ్య నాయకత్వంలో మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్డు రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి సీతక్క లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టి ముత్తయ్య వారి రాష్ట్ర కమిటి నాయకులకు మంత్రులు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.
నానాటికి మారుతున్న పరిస్థితుల్లో వివిధ రంగాల్లో పెరిక కులస్థుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం అందించాలని, స్థానిక సంస్థల్లో పెరిక కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని, ప్రభుత్వ పరంగా ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో పెరిక కులస్తులకు అవకాశాలు కల్పించాలని వారు మంత్రులను విజ్ఞప్తి చేశారు. ఉత్పత్తి, శ్రమలో కీలకపాత్ర పోషించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో స్వయం కృషితో రాణిస్తున్న పెరిక కులస్తులు రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారని అలాంటి పెరిక కులస్థుల అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రభుత్వం తరపునుండి, పార్టీ నుండి సహకారం అందిస్తామని మంత్రులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు ధనేకుల కృష్ణ, ముఖ్య సలహాదారులు చింతం లక్ష్మీనారాయణ, డాక్టర్ సంగని మల్లేశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కోట మల్లికార్జున్, ఆక రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి రంగారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకత మల్లికార్జునరావు, ఆర్థిక కార్యదర్శి బోడకుంటి సుధాకర్, అధికార ప్రతినిధి సాయిని నరేందర్, రాష్ట్ర నాయకులు అంకత ఉమామహేశ్వర్ రావు, బుయ్యాని శివకుమార్, శ్రీధర్ల జగదీశ్వర్, గంప నాగరాజు, యర్రంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

