Site icon MANATELANGANAA

ఆపరేషన్ సింధూర్ తో పాక్ ను గడగడలాడించిన భారత్

operation sindhur

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్పూర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని పాకిస్థాన్ సైన్యం కూడా అధికారికంగా ధ్రువీకరించింది.

ఈ దాడులపై పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ “భారత్ మాతా కీ జై” అంటూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. భారత రక్షణ శాఖ త్వరలో ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనుందని తెలిపింది. భారత సైన్యం “న్యాయం జరిగింది” అంటూ అధికారికంగా పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
ఆపరేషన్ సిందూర్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. “జైహింద్” అంటూ ట్వీట్ చేస్తూ భారత సైన్యానికి మద్దతు తెలిపారు.


భారత దాడులను పాక్ సైన్యం అధికారికంగా అంగీకరించింది. పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకారం – “దాడుల్లో ముగ్గురు మరణించగా, 12 మందికి గాయాలయ్యాయి. భారత్ తాత్కాలిక విజయం పొందినా, దీని కోసం శాశ్వత నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.


పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై మండిపడ్డారు. “భారత్ ఐదు ప్రాంతాల్లో దాడి చేసింది. పాక్ దీన్ని సహించదు. దేశం మొత్తం సైన్యంతో కలసి శత్రువును ఎదుర్కొంటుంది” అని తెలిపారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇది హేయమైన చర్యగా అభివర్ణించాడు.– “ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలి” అన్నారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చారు.

Share this post
Exit mobile version