Site icon MANATELANGANAA

పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ సాగు మేలు

పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ సాగు మేలు బోర్లు, బావులు కింద ఆయిల్ పామ్, ఉద్యాన, మల్బరీ, కూరగాయలు,మునగ వంటి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు – ఎకరానికి లక్షన్నర ఆదాయం

నర్సింహులపేట/మహబూబాబాద్, సెప్టెంబర్.19

శుక్రవారం జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం, నర్సింహులపేట తదితర గ్రామాలు అలాగే నెల్లికుదురు మండలంలో బంజారా, నర్సింహులగూడెం తదితర గ్రామాల్లో పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను, నూతన రైతులతో సందర్శించి ఆయిల్ పామ్ సాగు చేయాలని మరియు మేలైన యాజమాన్య పద్దతులను తెలిపినారు. ప్రభుత్వం కల్పించే రాయితీలు పొంది ఆయిల్ పామ్ తోటలు నాటలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి టి. విజయపాల్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ అధికారులు నర్మద, అఖిల్, రైతులు కొత్త నరసింహ రెడ్డి, వీసాల రమేష్, వీసాల నాగయ్య, వీసాల కృష్ణయ్య, గట్టయ్య, మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version