Site icon MANATELANGANAA

టిబి వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్ కిట్లు

రెడ్ క్రాస్ హనుమకొండ: గవర్నర్ ఆదేశాలమేరకు హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ లో బుధవారం సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి. స్నేహ శబరీష్, IAS పాల్గొన్నారు. కలెక్టర్ కు రెడ్ క్రాస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు పూల మొక్క అందించి స్వాగతం పలికారు.

ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ లోని జనరిక్ మందుల షాప్, టైలరింగ్ శిక్షణ కేంద్రం, డే కేర్ సెంటర్ మంజూరి కొరకు సందర్శించి, తలసీమియా సెంటర్ ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసీమియా బాధితులకు పండ్లు పంపిణి చేసినారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు పాలకవర్గాన్ని అభినందించారు. పిదప రెడ్ క్రాస్ లో రెడ్ క్రాస్ ఆవరణలో మొక్క నాటారు.

అనంతరం ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా 30 మంది టిబి (క్షయ) వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు (పౌష్టకాహారం కోడిగుడ్లు సరుకులు), కిట్లు కలెక్టర్ మరియు పాలకవర్గం చేతులమీదుగా ఉచితముగా పంపిణి చేసినారు. ఈ నెల నుండి ఆరు నెలల వరకు ప్రతి నెల 30 మందికి న్యూట్రిషన్ కిట్లు అందచేస్తామని పాలకవర్గం తెలిపారు.

అనంతరం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్ కార్యక్రమాల గురించి అధికారులతో మీటింగ్ ఆరెంజ్ చేస్తాను అని తెలిపారు. అదేవిదంగా జీవితకాల సభ్యులను గురించి తెలుసుకుని సూచనలు చేసినారు. బ్లడ్ సెంటర్ లో భాగంగా రక్తదాన శిబిరాల గురించి, రెడ్ క్రాస్ నిధుల సమీకరణ గురించి ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదాన కార్యక్రమమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు తలసీమియా బాధితులకు చేస్తున్న సేవలకు రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని అభినందించారు.రెడ్ క్రాస్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు.

సన్మానం:రెడ్ క్రాస్ పాలకవర్గం కలెక్టర్ ను శాలువా, షీల్డ్ తో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు డా. పి. విజయచందర్ రెడ్డి (చైర్మన్), పెద్ది వెంకట నారాయణ గౌడ్ (వైస్ చైర్మన్), బొమ్మినేని పాపిరెడ్డి (కోశాధికారి), ఈ. వి. శ్రీనివాస్ రావు (రాష్ట్ర పాలకవర్గ సభ్యులు), జిల్లా పాలకవర్గ సభ్యులు : పుల్లూరు వేణు గోపాల్, డా. ఎం. శేషుమాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, డా. కె. సుధాకర్ రెడ్డి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ళ రమణ రెడ్డి, హనుమకొండ DM &HO : ఎ. అప్పయ్య, జిల్లా టిబి (క్షయ) నివారణాధికారి : కె. హిమబిందు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Share this post
Exit mobile version