Site icon MANATELANGANAA

జిల్లా కేంద్రంలో నూతన మార్కెట్ -ప్రతిపాదనలు సిద్దం చేయాలన్న కలెక్టర్

COLLECTOR DIWAKARA TS

జిల్లా కేంద్రంలో నూతనంగా వెజ్,నాన్ వెజ్ మార్కెట్ నిర్మించేందుకు అధికారులు ఎట్టకేలకు స్థలాన్ని ఎంపిక చేసారు. ప్రస్తుతం పట్టణం మద్యలో ఉన్న అంగడి మైదానం తో పాటు అక్కడే చుట్టు పక్కల మార్కెట్ నడుస్తోంది. అయితే ఈ ప్రదేశం మార్కెట్ కు సరిపోవడం లేదని మంత్రి సీతక్క చాలా రోజులుగా నూతన మార్కెట్ కు స్థలం అన్వేషించమని అధికారులకు చెప్పుతూ వస్తున్నారు.

ప్రస్తుతం అభివృద్ది అంతా బండారుపల్లి వైపు అట్లాగే జాతీయ రహదారి వెంట ఉన్న ప్రేమ్ నగర్ వైపు కేంద్రీకృత మవుతోంది. ప్రేమ్ నగర్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం పూర్తికా వస్తోంది. అగ్రికల్చర్ మార్కెట్ మెడికల్ కాలేజి అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండడంతో ఇక్కడి నుండి బండారుపల్లికి ప్రత్యేక రోడ్డువేసే అలోచనల్లో ఉన్నారు. బండారుపల్లి రోడ్డు వైపే రియల్చర్లు ఇప్పటికే పెట్టు బడులు పెట్టి భూములు కొని ప్లాట్లు చేసి విక్రయించారు. ప్రస్తుతం రియల్ వ్యాపారం పడిపోవడంతో మార్కెట్ సదుపాయం కల్పించాలని చాలా రోజులుగా కోరుతున్నారు. మంత్రి సీతక్క కూడ అటువైపే స్థలం చూడాలని సూత్రప్రాయంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పట్టణ వాసులు చెప్పుకుంటున్నారు.

ఒక వేళ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వెలువడితే ఆలోపలే శంకుస్థాపన పనులు జరగాలని మంత్రి అదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఈనేపద్యంలోనే గురువారం పట్టణంలో పర్యటించి స్థలం ఎంపికకు తుది నిర్ణయం తీసుకున్నారు. బండారుపల్లి రోడ్డులో ఉన్న పశు సంవర్ధక శాఖ కార్యాలయం అవరణలో నూతన మార్కెట్ కు అనువుగా ఉంటుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఇతర అధికారులు నిర్ణయానికి వచ్చారు.

ఈ సందర్భంగా మార్కెట్ గురించి అధికారులు జిల్లా కలెక్టర్ కు  వివరించారు.  ములుగులో ఇప్పుడు అంగడి మైదానంలో నడుస్తున్న మార్కెట్ స్థలంతో పాటు బండారుపల్లి రోడ్డులోని పశుసంవర్దక శాఖ అవరణ ప్రదేశాన్ని కూడ పరిశీలించారు.

నూతన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణమునకు ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఒకే మార్కెట్ ఉన్నందున, 

జిల్లా పశు వైద్య శాఖ కార్యాలయ ఆవరణంలో కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం వెజ్ నాన్ వెజ్ నూతన మార్కెట్ ను నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ప్రస్తుతం కొనగుతున్న మార్కెట్ యధాతదంగా నడుస్తుందని అధికారులువివరణ ఇచ్చారు కాని ప్రతి ఆదివారం జరిగే కూర గాయల అంగడి అక్కడే నడుస్తుందా లేక బండారుపల్లి రోడ్డుకు తరలించనున్నారా క్లారిటి ఇవ్వలేదు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈ ఈ అజయ్ కుమార్, జిల్లా పశు వైద్య శాఖ అధికారి కొమురయ్య, ములుగు తహసిల్దార్ విజయభాస్కర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version