Site icon MANATELANGANAA

కిట్స్ వరంగల్ క్యాంపస్ లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 14 నుండి 20 వరకు కిట్స్ వరంగల్ క్యాంపస్ లో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల రిజిస్టర్, ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి మాట్లాడుతూ “పుస్తకాలే జ్ఞానానికి ఆధారం. విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయాన్ని వినియోగించి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి” సమాజ అభివృద్ధికి, వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాలయాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. జ్ఞానాన్ని విస్తరించే కేంద్రాలుగా గ్రంథాలయాలు విద్యార్థులకు, పరిశోధకులకు, పాఠకులకు మార్గదర్శకాలు.అని తెలిపారు. “గ్రంథాలయ వారోత్సవాల ద్వారా పఠనాభిరుచిని పెంపొందించాలనే ఉద్దేశ్యం ఉన్నది” అన్నారు.

డీన్ అకాడమిక్ డాక్టర్ కె. వేణుమాధవ్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో సమాచార సేకరణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో గ్రంథాలయాల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. పుస్తక చదువుతోపాటు డిజిటల్ వనరులను వినియోగించుకోవడం ద్వారా విద్యార్ధులు సమగ్ర అభ్యాసం సాధించాలన్నారు.

కళాశాల లైబ్రేరియన్ డా. కోమల్ల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ , నవంబర్ 14 నుండి 20 వరకు జరగబోయే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా కళాశాల గ్రంథాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో పుస్తక ప్రదర్శనలు, పఠన పోటీలు, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు . నేటి డిజిటల్ యుగంలో పుస్తకాల విలువలను గుర్తు చేస్తూ గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేయడమే జాతీయ గ్రంథాలయ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. అనంతరం లైబ్రరీ సమాచార బ్రోచర్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ లు డాక్టర్ ఎం. వీరారెడ్డి, డాక్టర్ వి. రాజగోపాల్, డాక్టర్ ఎం శ్రీలత, డాక్టర్ సి వెంకటేష్, డాక్టర్ యు. శ్రీనివాస్ బాలరాజు మరియు లైబ్రరీ కమిటీ సభ్యులు గ్రంథాలయ సిబ్బంది డాక్టర్ ఎం. నిరంజన్, డాక్టర్ ఎం. అరుణ్ కుమార్, టి. రాజు, సిహెచ్. ప్రకాష్ మరియు విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ డి. ప్రభాకరా చారి పాల్గొన్నారు.

Share this post
Exit mobile version