Site icon MANATELANGANAA

ములుగు జిల్లా కలెక్టర్ కు అరుదైన గౌరవం

సంపూర్ణ తా అభియాన్ లో
రాష్ట్ర స్థాయిలో అవార్డు.

సంపూర్ణత అభియాన్ రాష్ట్ర అవార్డు అందుకున్న సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్‌ టి.ఎస్.కు
టి.జి.ఓ.లు ఘన సత్కారం చేసారు


సమిష్టి కృషితోనే సంపూర్ణ తా అభియాన్ లో రాష్ట్ర స్థాయిలో అవార్డు సాధించామని జిల్లా కలెక్టర్ టి.ఎస్. తెలిపారు.

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP), తెలంగాణ ఆధ్వర్యంలో ఆగస్టు 2న హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో నిర్వహించిన “సంపూర్ణత అభియాన్ రాష్ట్ర స్థాయి అవార్డుల కార్యక్రమం”లో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా ములుగు జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం మన జిల్లా కు గర్వకారణం. ఇది ఒక వ్యక్తిగత విజయంగా కాకుండా, అందరి సమిష్టి కృషి ఫలితంగా సాధించగలిగిన గొప్ప విజయంగా భావిస్తున్నాను. ఇదే స్పూర్తితో అందరూ సమన్వయం తో కలిసి పనిచేస్తూ, జిల్లాను అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిద్దామని అన్నారు.

అదే కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్న అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్ రావు TGOs ములుగు జిల్లా అధ్యక్షులు కూడా సంఘం తరపున సత్కరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
“పనినే పరమావధిగా భావించి, అంకితభావంతో పనిచేస్తే సేవకు గుర్తింపు లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో TGOs జిల్లా కార్యదర్శి కందుల జీవన్ కుమార్, ట్రెజరర్ ప్రకాశ్ రెడ్డి, ఉపాధ్యక్షులు దేవరాజ్, కొమురయ్య, శిరీష, రాజు, విజయభాస్కర్, శైలజ, యశ్వంత్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version