Site icon MANATELANGANAA

ఎమ్మెల్యే బంబర్ ఆఫర్ రైతులకు ఫ్రీగా యూరియా

తన అంగరక్షకుడు యూరియా లారీ లోడ్ బ్లాక్ మార్కెట్ కు తరలించిన సంఘటనలో బాగా బద్నామ్ అయిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
యూరియా లారీ దారిమళ్లిన కేసులో ఎమ్మెల్యేకు సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే బీఆరెస్ పార్టీ చేయాల్సినంత బ్లెమ్ చేసింది.
దాంతో లక్ష్మారెడ్డి తన నియోజక వర్గం ప్రజల్లో సింపతీ కోసం ఏకంగా రైతులకు ఫ్రీగా యూరియా పంచేందుకు రెండు కోట్ల విరాళం ఇచ్చారు.
తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ విందు (రిసిప్షన్) రద్దు చేసుకుని అందుకు అయ్యే ఖర్చు రెండు కోట్లు సీఎంకు ఇచ్చాడు.

గురువారం కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేససాడు మిర్యాలగూడ ఎం ఎల్ ఏ బత్తుల లక్ష్మారెడ్డి.

2 కోట్లను తన నియోజకవర్గం లోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేసాడు.

లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితం గా అందజేయాలని కోరిన ఎంఎల్ ఏ సీఎం ను కోరాడు.

ఇటీవల ఎంఎల్ ఏ కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది.

మిర్యాలగూడ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన ఎంఎల్ ఏ లక్ష్మారెడ్డి..

యూరియా లారీ దారి మళ్ళిన ఘటనలో బాగా మనస్థాపానికి గురై ఇట్లా చేసాడని చర్చ సాగుతోంది. రిసెప్షన్ ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చిన ఎంఎల్ఏ
లక్ష్మారెడ్డిని కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

అయితే ఎమ్మెల్యే ఎంతగా డామేజ్ కవర్ చేసుకోవాలనుకున్న జరగాల్సిన డామేజ్ జరిగింది కదా. రైతులు యూరియా విషయంలో అగ్రహాంతో ఉన్నారు.

Share this post
Exit mobile version