Site icon MANATELANGANAA

మేడారం జాతర పనులపై సచివాలయంలో మంత్రి సీతక్క – మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం


హైదరాబాద్‌: మేడారం జాతర నిధులు, పనుల పై సచివాలయంలో మంత్రి సీతక్క, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మ జాతర జనవరి 28 నుండి 31 వరకు ఘనంగా జరుగనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణ కోసం రూ.150 కోట్లు విడుదల చేసినట్టు ఆమె వెల్లడించారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆషియాలోనే అతిపెద్ద ఆదివాసీ మేళాగా గుర్తింపు పొందిందని అన్నారు. జాతరకు ముందస్తు ఏర్పాట్ల కోసం ఇప్పటికే నిధులు కేటాయించినట్టు చెప్పారు.
జంపన్న వాగు నుండి ఊరి వరకు డివైడర్లతో డబుల్ రోడ్డు నిర్మాణం జరుగుతోందని, 29 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో స్మృతివనం ఏర్పాటుచేస్తున్నామని మంత్రి సీతక్క వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా జాతర–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీతక్క, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, పనుల జాతరపై కూడా వివరాలు అందజేశారు. రూ.2,198 కోట్ల వ్యయంతో 1,01,589 పనులు చేపట్టనున్నట్టు తెలిపారు.
“పనుల జాతరలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా లేఖలు రాశాను. ప్రజలకు ఉపాధి కల్పించడం మాత్రమే కాకుండా, గ్రామాల రూపురేఖలు మారేందుకు పనుల జాతర దోహదపడుతుంది. అందరూ ఉత్సాహంగా ఇందులో పాల్గొనాలి” అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Share this post
Exit mobile version