ముంచుకొస్తున్న ముప్పు….
హైదరాబాద్: భారతదేశంలో పాల కల్తీ సంక్షోభం – అత్యధికంగా రాజస్థాన్‌లో 97% నమూనాలు కలుషితం!
భారతదేశంలో పాల ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యధికం. ఉత్పత్తి తో పాటే పాల కల్తీ కూడా అత్యధికమే.
2025 నాటికీ 85 శాతం కాన్సర్ భారిన పడ నున్నారని WHO హెచ్చరించి నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి.
పాల కల్తీ సమస్య దేశంలో భయానక స్థాయికి చేరింది వాస్తవం.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా అమ్మకానికి వచ్చే పాలు మరియు డెయిరీ ఉత్పత్తులలో 68.7 శాతం కల్తీతో కలుషితమయంగా తేలాయి. ఈ కల్తీ పాల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘2025 నాటికీ 87 శాతం భారతీయులకు క్యాన్సర్ ప్రమాదం’ అనే ఆరోపణలో నిజం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసింది. ఇది తప్పుడు సమాచారమే అని ఫ్యాక్ట్-చెక్ సైట్లు నిర్ధారించాయి.
అసలు పాలలో కల్తీ ఎలా జరుగుతోంది?
పాల విక్రయదారులు ప్రధానంగా మూడు విధానాలలో కల్తీ చేసి మోసం చేస్తున్నారు. మొదటిది నీటి కల్తీ. పాలలో 50-75% నీరు కలిపి మొత్తా నికి మొత్తాన్ని పెంచుకుంటారు. ఇది అత్యంత సాధారణమైన పద్ధతి, దీనివల్ల పాల గుణాలు పూర్తిగా దెబ్బతింటాయి. రెండవది అత్యంత ప్రమాదకరం అయిన రాసాయనాలు – యూరియా, డిటర్జెంట్లు, కాస్టిక్ సోడా, స్టార్చ్, ఫార్మాలిన్ వంటి పదార్థాలు కలిపి పాలను తాజాగా కనిపించేలా చేస్తారు.
యూరియా కల్తీ వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి. డిటర్జెంట్లు జీర్ణషాయం పేగులు దెబ్బ తెస్తాయి. మూడవది సింథటిక్ మిల్క్ తయారి… పాలల్లో పెట్రోలియం ప్రొడక్ట్స్, వెజిటబుల్ ఆయిల్స్ మిక్స్ చేసి కృత్రిమ పాలు తయారుచేసి అమ్ముతారు. ఇవి క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులకు కారణమవుతాయి.
ఈ కల్తీలు కేవలం నగరాల్లోనే కాకుండా, పల్లెల్లోనూ విస్తరించాయి. అక్రమ సంపాదన కోసం ఈ వ్యాపారం జరుగుతున్నది. అధికారుల తనిఖీల్లో లంచాలు ఇచ్చి కేసులు తప్పించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఏ రాష్ట్రంలో ఎక్కువ కల్తీ?
భారత దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కల్తీ రేటు భయంకరంగా ఉంది. రాజస్థాన్‌లో 2024-25లో తనిఖీ చేసిన 7,299 పాల నమూనాల్లో 3,475 (48.24%) నీటితో కల్తీ అయ్యాయి, మొత్తం 97% నమూనాలు కలుషితంగా తేలాయి – ఇది దేశంలో అత్యధిక రేటు! బికనేర్ ప్రాంతంలో 97% నమూనాలు కల్తీతోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 250 కేసులు నమోదయ్యాయి, పంజాబ్‌లో పనీర్, ఘీలో 37-40% కల్తీ. హర్యానాలో 22% రేటు, తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే ఎక్కువ.
ప్రభుత్వ ఏం చేయాలి.. పౌరుల బాధ్యత ఏమిటి..
ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ద్వారా ‘డార్ట్’ (డిటెక్ట్ అడల్టరేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్) కిట్‌లు అందుబాటులో ఉంచింది.
ఇంట్లోనే పాల కల్తీ తనిఖీ చేసుకోవచ్చు – ఉదాహరణకు, పాల డ్రాప్‌ను భూ ఉపరితలంపై వేస్తే, కల్తీ అయితే త్వరగా కలిసిపోతుంది.
అధికారులతో పాటు సామాన్య పౌరులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలో పాల ఉత్పత్తి 230 మిలియన్ టన్నులు (2022-23) కావటంతో, “ఎన్ని ఆవులు-గేదెలు ఉన్నాయి, ఎంత మేర పాలు వస్తున్నాయి?” అని ఆలోచించాలి. కల్తీ-రహిత పాల కోసం ఆర్గానిక్ ఆప్షన్లు, లైసెన్స్‌డ్ సప్లయర్లను ఎంచుకోవాలి. ఈ సమస్యను అరికట్టకపోతే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

