హనుమకొండ సన్ రైజ్ హాస్పిటల్ లో ఆదివారం రిటైర్డ్ కాలేజి టీచర్స్ కు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈవైద్య శిబిరంలో వందమంది అధ్యాపకులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారని రిటైర్డ్ కాలేజి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సారంగపాణి,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.మల్లారెడ్డి తెలిపారు. శిబిరంలో బి.పి,షుగర్,బాడీమాస్ ఇండెక్స్, బోన్ మ్యారో డెన్సిటీ పరీక్షలు నిర్వహించారని తెలిపారు.
విశ్రాంతఅధ్యాపకులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యసమస్యలపై సలహాలు సూచనలు ఇచ్చిన సన్ రైజ్ ఆసుపత్రి యాజమాన్యానికి శిబిరంలో పాల్గొన్న వైద్యులకు,ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ కళాశాలల రిటైర్డ్ అధ్యాపకుల ఆరోగ్య సమస్యల పట్ల సంఘం ఎప్పటి కప్పుడు తగిన విదంగా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుందని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సంఘానికి తెలియచేస్తే తగిన సహాయ చర్యలతో తోడ్పడతామని తెలిపారు.