Site icon MANATELANGANAA

లయన్ కన్నాకు జీవన సాఫల్య పురస్కారం

హైదరాబాద్:
లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ సీనియర్ జర్నలిస్ట్ లయన్ కన్న పరశురాములు ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.

ఈ అవార్డును డిసెంబర్ 28, ఆదివారం సాయంత్రంన్యూ శాయంపేట లయన్స్ భవన్లో నిర్వహించనున్న 2024–25 సంవత్సరపు అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదానం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వ జిల్లా గవర్నర్, మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ లయన్ కుందూరు వెంకటరెడ్డి అవార్డును అందజేస్తారని 2024–25 జిల్లా క్యాబినెట్ కార్యదర్శి లయన్ సయ్యద్ హబీబ్ తెలిపారు.

గత ఏడాది జిల్లాలో విశేష సేవలు అందించిన క్లబ్‌లు, క్లబ్ అధ్యక్షులు, నాయకులకు కూడా ఈ సందర్భంగా పురస్కారాలు అందజేయనున్నారు.

ఈ ఏడాది జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న లయన్ కన్న పరశురాములు 1985లో లయన్స్ వసుధైక కుటుంబంలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2022–23 సంవత్సరంలో జిల్లా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీకాలంలో 64 క్లబ్‌లు, 8 రీజియన్ చైర్మన్లు, 24 జోన్ చైర్మన్లు, అలాగే మరో ఐదుగురు లయన్స్ నాయకులు అంతర్జాతీయ అధ్యక్షుడి ఎక్సలెన్స్ అవార్డులు పొందడం విశేషం.

నాలుగు దశాబ్దాలుగా లయన్స్ వేదికగా అంధత్వ నిర్మూలన లక్ష్యంగా నేత్ర పరీక్షా శిబిరాలు నిర్వహించడం, అవసరార్థులకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు అందించడం, రక్తదాన శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

సంస్థ విస్తరణలోనూ విశేష కృషి చేసి నూతన లయన్స్ క్లబ్‌ల స్థాపనకు ముందుండగా, ఆయా క్లబ్‌ల నుంచి అనేకమంది లయన్స్ నాయకులుగా ఎదిగారు.

వృత్తిరీత్యా జర్నలిస్ట్‌గా సేవలందిస్తూ, ప్రవృత్తిగా లయన్స్ సేవా సామ్రాజ్యంలో విశేషంగా రాణించిన లయన్ కన్న పరశురాములకు జీవన సాఫల్య పురస్కారం లభించడం పట్ల ఆయన వృత్తి సహచరులు, సేవా మిత్రులు, అలాగే ఆయన హోం క్లబ్ జనగామ ఆబాద్ లయన్స్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Share this post
Exit mobile version