లంబాడీల రిజర్వేషన్ ల పై కుట్రలు మానుకోవాలి
ఉద్రిక్తంగా లంబాడీల ఆత్మగౌరవ మార్చ్
లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు ఆంగోత్ వినోద్ లోక్ నాయక్, డా గుగులోత్ రాజు నాయక్
లంబాడీల రిజర్వేషన్ పై మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తమ కుట్రలు మానుకోవాలని లంబాడి రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు ఆంగోత్ వినోద్ లోక్ నాయక్, డా.గుగులోతు రాజు నాయక్ డిమాండ్ చేసారు.
ఈ రోజు హనుమకొండ నక్కలగుట్టలో తాను నాయక్ విగ్రహం వద్ద లంబాడి రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన లంబాడి ఆత్మగౌరవ మార్చ్ లో వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 342 ద్వారా 1976లో ఎస్టీ జాబితాలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, రాష్ట్రపతి ముద్ర ద్వారా ప్రత్యేక బిల్ చేసి ప్రత్యేక భాష, వేషం, సంస్కృతి, సాంప్రదాయాలు, కలిగిన తండాలు ఉన్న లంబాడీలను ఎస్టి జాబితాలో ఇందిరాగాంధీ నాయకత్వంలో చేర్చారని తెలిపారు. కావాలని రాజకీయ కుట్రతోనే అదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఇందులో లంబాడీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్యాంగాన్ని నమ్ముకుని ఈ దేశ మూలవాసులుగా ఉన్న లంబాడీలు స్వతంత్ర ఉద్యమంలో, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, రైతాంగ సాయుధ పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను అర్పించి కొట్లాడి ముందు వరుసలో ఉన్నారని గుర్తు చేశారు.
స్వాతంత్రానికి ముందు తెలంగాణ ప్రాంతం నిజాం స్టేట్ లో ఉండడంవల్ల ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలో ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 1948 ఆపరేషన్ పోలో తర్వాత విమోచన కలిగి లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో తప్పిదం జరిగిందని 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎస్టీల రిజర్వేషన్ లను కించపరుస్తూ పిటిషన్లు దాఖలు చేసి లంబాడీలు ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ అయోమయానికి గురిచేయడం సరైన విధానం కాదని హెచ్చరించారు.
ఈ లంబాడి ఆత్మగౌరవ మార్చ్ కు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి మండలాల నుంచి అనేకమంది తరలి వచ్చారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సీనియర్ నాయకులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఉదయ్ సింగ్, ఆంగోత్ భద్రయ్య, కెలోతు బిక్షపతి నాయక్, లకవతు రవీందర్ నాయక్, అశ్విన్ రాథోడ్, దుంగ్రోతు కిషోర్ నాయక్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వెంకట్ నాయక్, రమేష్ నాయక్, అశోక్ నాయక్, కునుసోతు మురళి నాయక్,విజయ్ నాయక్, భూక్య రాజు నాయక్, డాక్టర్ చందు నాయక్, హేమ నాయక్ కరెంట్ గిరిజన జేఏసీ అజ్మీరా శ్రీరామ్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాలోత్ రమేష్ నాయక్, రమేష్ రాథోడ్,కుర్ర శోభన్,మంత్రు నాయక్, సుభాష్ నాయక్,పోరిక రాహుల్, జగన్ నాయక్,వాలు నాయక్,సంతోష్ నాయక్,రాయల్ లంబాడీ విజయ్, గోపాలపూర్ అధ్యక్షులు జవహర్ నాయక్, కేయూ తిరుపతి, అనూష అజ్మీరా, బానోతు శిరీష, నవ్యశ్రీ, సంగీత, ఆర్ట్స్ కళాశాల అనిల్ , కెడిసి కళాశాల నవీన్ నాయక్, బోడ నరసింహ,భూక్యా భద్ర,దీన్ దయాల్నగర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.