Site icon MANATELANGANAA

రీల్ మేకింగ్ పోటీల్లో కిట్స్ వరంగల్ విద్యార్థులకు ద్వితీయ బహుమతి

రూ.15 వేల నగదు బహుమతి.. ‘ఫ్యూచర్ మేకర్స్’ బృందానికి అభినందనలు

వరంగల్: జాతీయ స్థాయి ప్రంట్ లెవల్ రీల్ మేకింగ్ పోటీలు–2026లో కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వరంగల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు. స్వామి వివేకానంద జన్మదిన వేడుకల (SVBC) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌కు చెందిన విద్యార్థులు రూ.15 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు.

ఈ విజయాన్ని కిట్స్ వరంగల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు ప్రకటించి, విజేతలను అభినందించారు.

వివేకానంద కేంద్ర కన్యాకుమారి (VKK) తెలుగు ప్రాంత్, హైదరాబాద్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి 25 వరకు మూడు రోజులపాటు లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రంట్ లెవల్ రీల్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ‘డిజిటల్ మీడియా అండ్ యూత్’ అనే అంశంపై ఈ పోటీలు జరిగాయి.

డిజిటల్ మీడియా ప్రభావం, దేశ నిర్మాణంలో దాని పాత్రపై యువతలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు. డిజిటల్ మీడియాను బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా వినియోగించడం ద్వారా యువత జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు సామాజిక బాధ్యతను అలవర్చుకుని, మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించిన బృందానికి ‘ఫ్యూచర్ మేకర్స్’ అని పేరు పెట్టారు. ఈ బృందంలో బీటెక్ మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) విద్యార్థులు సాయితేజ రెడ్డి, అక్షయ, సౌమ్య, నంద కిషోర్, శివ రంజన్ ఉన్నారు.

కిట్స్ వరంగల్ క్యాంపస్‌లోని కమిటీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి. నారాయణరెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ కె. శ్రీధర్, ఎస్‌వీబీసీ క్లబ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జిలు, ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్, ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. గౌతమ్ రాజు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్వో డాక్టర్ డి. ప్రభాకర చారి తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version