పాల్గొన్న 145 జట్లు
వరంగల్, సెప్టెంబర్ 21:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ (కెఐటిఎస్ డబ్ల్యూ)లోని సిఎస్‌ఈ (AIML-CSM) విభాగం, సెంటర్ ఫర్ I2RE సంయుక్త ఆధ్వర్యంలో **స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2025 (SIH-2025)**కు సంబంధించిన ఇంటర్నల్ హ్యాకథాన్ను విజయవంతంగా నిర్వహించింది. వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన 145 జట్లు ఉత్సాహంగా పాల్గొని తమ క్రియేటివిటీ, ఇన్నోవేషన్, సమస్యల పరిష్కార ప్రతిభను ప్రదర్శించాయి. వీటిలో 50 జట్లు ఎస్‌ఐహెచ్–2025లో సంస్థ తరఫున పాల్గొనడానికి ఎంపికయ్యాయి.
ఈ కార్యక్రమాన్ని కెఐటిఎస్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యలో ఇన్నోవేషన్, ఎంట్ర పెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. మొత్తం 21 వేదికల్లో విద్యార్థుల ప్రాజెక్టులను అకాలమిక్ & ఇండస్ట్రీ నిపుణులు సమీక్షించారు.
ఈ కార్యక్రమానికి డా. రాజా నరేందర్ రెడ్డి (హెడ్, I2RE), డా. ఎస్. నరసింహ రెడ్డి (హెడ్, సిఎస్‌ఈ- AIML), డా. పి. విజయ్ కుమార్ (ప్రెసిడెంట్, IIC) మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు & కెఐటిఎస్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మికాంతరావు, ఖజాంచి పి. నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే & అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి లతో కలిసి విభాగం అధ్యాపకులు, నిర్వాహకులు, విద్యార్థులను అభినందించారు.
టీమ్ I2RE, డా. డి. కుమార్, డా. ఏ. జ్యోతి ప్రభ, అధ్యాపక మార్గదర్శకులు, జడ్జీలు, విద్యార్థి వాలంటీర్లకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఈ హ్యాకథాన్ సమన్వయకర్తలుగా డా. కె. శివకుమార్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, సిఎస్‌ఈ- AIML, ఎస్‌పిఓసి & కోఆర్డినేటర్ SIH-2025), పి. శ్రవణ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, సిఎస్‌ఈ- AIML, కో-కోఆర్డినేటర్ SIH-2025) కృషి ప్రశంసనీయమైంది.
ఈ కార్యక్రమంలో 550 మందికి పైగా విద్యార్థులు, 150 మంది అధ్యాపకులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, సిబ్బంది, పిఆర్వో & అసోసియేట్ ప్రొఫెసర్ డా. డి. ప్రభాకర చారి పాల్గొన్నారు. ఎస్‌ఐహెచ్–2025 ఇంటర్నల్ హ్యాకథాన్ విద్యార్థుల ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లే వేదికగా నిలిచింది.