వరంగల్, సెప్టెంబర్ 12:కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITS), వరంగల్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (నెట్‌వర్క్స్) విభాగం ఫ్యాకల్టీ శుక్రవారం ఇండస్ట్రియల్ విజిట్‌ను నిర్వహించింది.
మొత్తం 23 మంది ఫ్యాకల్టీ సభ్యులు హైదరాబాద్‌లోని జెన్ వి సొల్యూషన్స్ సంస్థను సందర్శించారు.
ఈ విజిట్ ద్వారా ఫ్యాకల్టీ నైపుణ్యాల పెంపు, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్లు మరియు అకడమియా–ఇండస్ట్రీ మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు, KITS చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మికాంతరావు, ట్రెజరర్ పి. నారాయణరెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే KITS అదనపు కార్యదర్శి వోడితల సతీష్‌కుమార్ అభినందించారు. విద్యార్థుల టెక్నికల్ స్కిల్స్ అభివృద్ధి చేసి, ఉన్నతమైన ప్లేస్‌మెంట్లు సాధించడంలో విభాగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
జెన్ వి సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటస్వామి మాట్లాడుతూ ఈ విధమైన కార్యక్రమాల ద్వారా కన్సల్టెన్సీ అవకాశాలు, ఫ్యాకల్టీ అప్‌స్కిలింగ్, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్లలో సహకారం లభిస్తాయని తెలిపారు. ఆధునిక టెక్నాలజీలపై పరిజ్ఞానం పెంపుతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశోధన, ఇన్నోవేషన్‌లకు తోడ్పడతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జెన్ వి సొల్యూషన్స్ సీఈఓ శ్రీమతి సుజాత కరుకూరి, విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ వి. శంకర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వోదితల స్వాతి, 23 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
KITS వరంగల్ – సిఎస్‌ఈ నెట్‌వర్క్స్ ఫ్యాకల్టీ ఇండస్ట్రియల్ విజిట్
