Site icon MANATELANGANAA

కిట్స్ వరంగల్ సివిల్ ఇంజినీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ బి. సాయిలక్ష్మణ్‌కు ఐఐఎస్‌సీ బెంగళూరు పీహెచ్‌డీ

కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వరంగల్‌లోని సివిల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. సాయిలక్ష్మణ్‌కు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) సివిల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ డిగ్రీని ప్రదానం చేసింది.

క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (క్యూఐపీ) కింద ఐఐఎస్‌సీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ పి. అన్బళగన్ మార్గదర్శకత్వంలో ఆయన పరిశోధన చేశారు. “Development and Evaluation of Limiting Dry Densities: Redefining Relative Density & Dynamic Property Models of Sands” అనే అంశంపై ఆయన సిద్ధం చేసిన పరిశోధనా గ్రంథాన్ని ఐఐఎస్‌సీకి సమర్పించారు. 2026 అక్టోబర్ 12న తన పరిశోధనా గ్రంథంపై విజయవంతంగా మౌఖిక పరీక్షను పూర్తి చేశారు.

ఈ విషయాన్ని కిట్స్ వరంగల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు వెల్లడించి డాక్టర్ సాయిలక్ష్మణ్‌ను అభినందించారు.

కిట్స్ వరంగల్ కోశాధికారి శ్రీ పి. నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఇసుక నేలల్లో కనిష్ఠ, గరిష్ఠ పొడి సాంద్రతలు, వాటి ప్రభావం వల్ల నేలల డైనమిక్ లక్షణాల్లో వచ్చే మార్పులపై డాక్టర్ సాయిలక్ష్మణ్ పరిశోధన చేసినట్లు తెలిపారు. ఇసుక సాంద్రత పరిమితులను నిర్ధారించేందుకు ప్రత్యేక ప్రయోగశాల పరికరాలను అభివృద్ధి చేశారని, వీటి ద్వారా పరీక్షల సామర్థ్యం పెరగడంతో పాటు అవసరమైన మట్టి నమూనాల పరిమాణం తగ్గుతుందని వివరించారు. ఆయన పరిశోధన ఫలితంగా రెండు పేటెంట్లు కూడా మంజూరయ్యాయని తెలిపారు.

కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, జియోటెక్నికల్ ఇంజినీరింగ్ పరిశోధన రంగంలో డాక్టర్ సాయిలక్ష్మణ్ చేసిన కృషిని అభినందించారు. ఆయన పరిశోధన అనుభవం, నైపుణ్యం కళాశాల విద్యా, పరిశోధనా కార్యకలాపాలకు మరింత ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, కోశాధికారి శ్రీ పి. నారాయణరెడ్డి, అదనపు కార్యదర్శి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి డాక్టర్ సాయిలక్ష్మణ్‌కు అభినందనలు తెలిపారు.

రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీకాంత్, ప్రొఫెసర్ ఎల్. సుధీర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎం. వీరారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్వో డాక్టర్ డి. ప్రభాకర చారి, డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది డాక్టర్ సాయిలక్ష్మణ్‌ను అభినందించి ఆయన పరిశోధనా విజయాలను ప్రశంసించారు.

Share this post
Exit mobile version