Site icon MANATELANGANAA

“ఫిల్ ఎ ప్లేట్, షేర్ ఎ స్మైల్” – కిట్స్ వరంగల్ హ్యూమానిటీ క్లబ్ సేవా కార్యక్రమం



వరంగల్, అక్టోబర్ 11, 2025:
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్‌), వరంగల్‌లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (SAC) ఆధ్వర్యంలో హ్యూమానిటీ క్లబ్ “ఫిల్ ఎ ప్లేట్, షేర్ ఎ స్మైల్” అనే ఆహార దానం కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందించడం, అవసరమైన వారికి ఆహారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోకరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి పి. కృష్ణారెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌, మరియు ఇ. రమేష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి (హన్మకొండ) మద్దతు అందించారు.


హన్మకొండ, కాజీపేట, వరంగల్ ప్రాంతాల్లో పేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఆకలి సమస్యపై అవగాహన పెంచడం, సేవా స్పూర్తిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.


స్టూడెంట్ అఫైర్స్ డీన్ మరియు ఈఐఈ విభాగం ప్రొఫెసర్ డా. ఎం. శ్రీలత మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యువతలో సామాజిక బాధ్యతను చూపించే మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యాసంస్థలు విద్యార్థులను సమాజ సేవ వైపు దారి చూపగలవని ఆమె అన్నారు.


ఈ కార్యక్రమంలో డా. డి. ప్రభాకర చారి (అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ & PRO), డా. జి. శ్రీనివాసరావు (హ్యూమానిటీ క్లబ్ ఇన్‌చార్జ్), అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


క్లబ్‌ నాయకత్వ బృందం పి. వైష్ణవి రెడ్డి (ప్రెసిడెంట్), ఎ. వివేక్ రెడ్డి (వైస్ ప్రెసిడెంట్), టి. అక్షిత్ పటేల్, మొహమ్మద్ సమీద్, బి. తరుుణ్ (జాయింట్ సెక్రటరీస్) లతో పాటు సుమారు 100 మంది విద్యార్థి వాలంటీర్లు పాల్గొన్నారు.


“ఫిల్ ఎ ప్లేట్, షేర్ ఎ స్మైల్” కార్యక్రమం ద్వారా హ్యూమానిటీ క్లబ్ సేవా భావనను, మానవతా విలువలను ప్రతిబింబించింది.

Share this post
Exit mobile version