Site icon MANATELANGANAA

కిట్స్ వరంగల్ విద్యార్థికి రూ.35 లక్షల ప్యాకేజీ


వీసా ఇన్‌క్‌లో ఎంపికైన బీటెక్ తృతీయ సంవత్సరం విద్యార్థి
వరంగల్:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITS), వరంగల్‌కు చెందిన బీటెక్ తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థి కల్వచెర్ల సాయి చరణ్ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ ‘వీసా ఇన్‌క్ (VISA Inc.)’ లో రూ.35 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ ఎంపిక కిట్స్ వరంగల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ ద్వారా జరిగింది. ఈ ఆఫర్‌లో నెలకు రూ.90,000 ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ కూడా ఉంది.
ఈ సందర్భంగా కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, తృతీయ సంవత్సరం చదువుతూనే అంతటి భారీ ప్యాకేజీ సాధించడం సాయి చరణ్ కృషికి నిదర్శనమని అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి కిట్స్ అందిస్తున్న శిక్షణ ఫలితమే ఈ విజయం అని పేర్కొన్నారు.
కిట్స్ వరంగల్ ప్రిన్సిపల్ డా. కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమలో అవసరమైన ఆధునిక సాంకేతికతలను నిరంతరం నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, నైపుణ్యాలను పదునుపెట్టుకోవడం వల్లే సాయి చరణ్ ఈ స్థాయి ప్యాకేజీ సాధించగలిగాడని తెలిపారు.
కళాశాల ట్రెసరర్ పి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, నిరంతర అభ్యాసం, కోడింగ్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టి పెట్టడం వల్లే ఉన్నత వేతన ఉద్యోగం సాధ్యమైందని చెప్పారు. ప్రస్తుత 2025–26 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు కళాశాలలో 439కు పైగా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కిట్స్ అదనపు కార్యదర్శి ఒడితల సతీష్ కుమార్, డీన్–ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ ప్రొఫెసర్ వై. పురందర్, సిఎస్‌ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. నిరంజన్, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఈ. కిరణ్ కుమార్, టీపీఓ డా. టి. చంద్రబాయి, అధ్యాపకులు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్లు మరియు డీన్లు సాయి చరణ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Share this post
Exit mobile version