Site icon MANATELANGANAA

పదవి విరమణ చేసిన కిట్స్ ప్రొఫెసర్ కామాక్షి కి ఘనంగా వీడ్కోలు


KITS ప్రొఫెసర్ పి. కామాక్షి పదవి విరమణ వేడుకలు
వరంగల్, మే 31:
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITS WARANGAL)లో ఐటి విభాగానికి చెందిన అధ్యాపకురాలు డాక్టర్ పి. కామాక్షి పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకను సిల్వర్ జుబిలీ సెమినార్ హాల్‌లో స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ కామాక్షి 21 ఏళ్ల పాటు వివిధ బాధ్యతల్లో పనిచేశారని, ఆమె శ్రమ, నిబద్ధత, క్రమశిక్షణ, మానవత్వం, మరియు మహిళా సాధికారత ప్రశంసనీయం అని కొనియాడారు. కిట్స్ వరంగల్ విద్యా సంస్థ కు ఆమె చేసిన సేవలు ప్రశంస నీయమన్నారు.
KITS -WARANGAL ఛైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మికాంత్ రావు, ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి ఆమె సేవలను అభినందించారు.


ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ కె. వేణుమాధవ్, ఐటి విభాగాధిపతి ప్రొఫెసర్ సెంతిల్ మురుగన్, స్టాఫ్ క్లబ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రాజనరేందర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ చిరంజీవి, ఖజాంచి డాక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్, ఇతర డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


వేడుక చివర్లో ప్రొఫెసర్ కామాక్షి గారికి సహచర అధ్యాపకులు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ, ఆమె సేవలను ఘనంగా గుర్తించి సన్మానించారు.

Share this post
Exit mobile version