Site icon MANATELANGANAA

KITS MOU WITH NSIC -హైదరాబాద్‌లోని యన్‌ఎస్ఐసితో కిట్స్ వరంగల్ అవగాహన ఒప్పందం

హైదరాబాద్‌లోని యన్‌ఎస్ఐసితో కిట్స్ వరంగల్ అవగాహన ఒప్పందం
KITS MOU WITH NSIC
హైదరాబాద్‌, ఏప్రిల్ 27: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్ఐసి) హైదరాబాద్ శాఖతో వరంగల్‌కు చెందిన కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్ వరంగల్) అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యూ) కుదుర్చుకుంది.

హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్‌ఎస్ఐసి జీఎం & సెంటర్ హెడ్ ఎన్.కె. సుబ్రమణి, మేనేజర్ ముత్తుకుమరన్, కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి పాల్గొని ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన సహకారం, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు, శిక్షణ, నియామకాల అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు.

ఈ అవగాహన కిట్స్ విద్యార్థుల్లో అవిష్కరణ, వ్యవస్థాపకతను ప్రోత్సహించి, అత్యుత్తమ ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుందని ఎన్.కె. సుబ్రమణి తెలిపారు. అలాగే, పరిశోధనార్ధక ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా ఇది సహకరించనున్నదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కిట్స్ వరంగల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి, అదనపు కార్యదర్శి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తదితరులు Principal గారిని మరియు కిట్స్ అధ్యాపక బృందాన్ని అభినందించారు.

కిట్స్ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వర్క్‌షాప్‌లు, సమావేశాలు, సెమినార్లు, అతిథి ఉపన్యాసాలు నిర్వహించి, పరిశోధన మరియు శిక్షణలో ముందడుగు వేయాలని సంకల్పించారు.

ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ తరఫున ఎం.ఓ.యూ లు మరియు ఇంటర్న్‌షిప్‌ల ఇన్‌ఛార్జ్ ప్రొఫెసర్ జి. రఘోత్తమ్ రెడ్డి, ఐ3సి ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్‌, కెమిస్ట్రీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ పిఆర్‌ఓ డాక్టర్‌ డి. ప్రభాకరాచారి, డీన్‌లు, అన్ని హెడ్‌లు, పాల్గొన్నారు.

Share this post
Exit mobile version