Site icon MANATELANGANAA

కిట్స్ ప్రొఫెసర్ హరికుమార్ కు డాక్టరేట్

వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్‌డబ్ల్యూ)లో మెకానికల్ ఇంజినీరింగ్ (యం ఈ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న హరి కుమార్ అందెంకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓ యూ) పరీక్షల నియంత్రణ అధికారి పీహెచ్‌డీ డిగ్రీని ప్రదానం చేసినారు అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు.

ఈ రోజు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో, కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎ. హరి కుమార్ “డెవలప్మెంట్ ఆఫ్ అల్యూమినియం కాంపోజిట్ ఫోమ్ అభివృద్ధి: అనలిటికల్ , న్యూమరికల్ అండ్ ఎక్సపెరిమెంటల్ క్యారెక్టరయిజేషన్” అనే సాంకేతిక అంశం పై థీసిస్ ను ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగానికి కి సమర్పించినారు. ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యం ఈ డి సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి. రమేష్ బాబు పర్యవేక్షణలో తన పరిశోధన ను విజయ వంతంగా కొనసాగించారు అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
తన పరిశోధనలో అల్యూమినియం కాంపోజిట్ ఫోమ్‌ల తయారు చేయడానికి మరియు వాటి యొక్క వివిధ ప్రాపర్టీస్ ను వర్గీకరించడానికి హరి కుమార్ పూర్తి క్రమబద్ధమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది ప్యాకేజింగ్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ పరిశ్రమలో విస్తృత ఇంజనీరింగ్ అనువర్తనాలను కలిగి ఉన్నాయి ఆయన నిర్ధారించారు.

ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, రాజ్య సభ మాజీ ఎం.పి., కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి అండ్ ఫార్మర్ హుస్నాబాద్ యం యల్ ఏ & కిట్స్ వరంగల్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ గారు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి గారు సంయుక్తంగా ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు మరింత వర్తించే వాస్తవ ప్రపంచ సమస్యలకి అవసరమైన పరిశోధనలు చేసినందుకు ఎ. హరి కుమార్ నీ శుభాకాంక్షలతో అభినందించారు.

ఈ కార్యక్రమంలో కిట్స్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొ. పి. రమేష్ రెడ్డి, యం ఈ విభాగపు హెడ్, & ప్రొఫెసర్ శ్రీకాంత్ పబ్బ, సెంటర్ ఫర్ ఐస్క్వేర్ అర్ఈ-హెడ్ & మెకానికల్ ఇంజనీరింగ్ విభాగపు ప్రొఫెసర్ కె. రాజ నరేందర్ రెడ్డి, యం ఈ విభాగపు ప్రొఫెసర్. కె. శ్రీధర్, వివిధ విభాగాల డీన్ లు అండ్ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పి. ఆర్. ఓ, డాక్టర్ డి. ప్రభాకరా చారి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి నీ పొందడం పట్ల హరి కుమార్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు.

Share this post
Exit mobile version